కాంగ్రెస్ లో చేరిన నటి దివ్యవాణి - కీలక బాధ్యతలు..!!
తెలంగాణ కాంగ్రెస్ లో చేరికలు కొనసాగుతున్నాయి. మరో ప్రముఖ నటి దివ్యవాణి కాంగ్రెస్ లో చేరారు. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ వర్సస్ బీఆర్ఎస్ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోరు కొనసాగుతోంది. ఈ సమయంలో చేరికల విషయంలో పార్టీ నాయకత్వం ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. అందులో భాగంగా బీజేపీలోకి వెళ్లిన నేతలను తిరిగి రప్పించటంలో సక్సెస్ అవ్వటంతో..మరి కొందరు ముఖ్యులతోనూ టచ్ లో వెళ్లింది. ఇక, దివ్యవాణికి ప్రచార బాధ్యతలు అప్పగించింది.
సినీ నటి దివ్యవాణి కాంగ్రెస్ లో చేరారు. గతంలో టీడీపీలో సుదీర్ఘ కాలం పని చేసిన దివ్యవాణి 2022 మే 31న తేదీన టీడీపీకి రాజీనామా చేసారు. టీడీపీలో ఉన్న సమయంలో వైసీపీ పైన తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు. టీడీపీ మహానాడు వేదిక పైన తనకు ప్రాధాన్యత ఇవ్వకపోవటం..నేతల తీరుతో దివ్యవాణి మనస్థాపానికి గురయ్యారు. దీంతో..2022 మే 31న తేదీన టీడీపీకి రాజీనామా చేస్తున్నట్టుగా దివ్యవాణి సోషల్ మీడియాలో ప్రకటించారు. తెలుగుదేశం పార్టీలో ఏం జరుగుతుందో అన్ని విషయాలను చెబుతానన్నారు. అయితే ఈ విషయమై ఆమె సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు విషయమై చంద్రబాబు అప్పట్లో ఆరా తీశారు. చంద్రబాబుతో చర్చించిన తర్వాత టీడీపీలో కొనసాగుతానని చెప్పుకొచ్చారు.

కాంగ్రెస్ లో చేరిన ప్రముఖ సినీ నటి, తెలుగుదేశం నాయకురాలు దివ్యవాణి చౌదరీ..!!#Divyavani #TDP #Congress #Oneindiatelugu pic.twitter.com/L4pNcfuJWo
— oneindiatelugu (@oneindiatelugu) November 22, 2023
కానీ, ఆ తరువాత దివ్యవాణిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ టీడీపీ నాయకత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో..దివ్యవాణి అప్పట్లోనే బీజేపీలో చేరుతారనే ప్రచారం సాగింది. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేసిన సమయంలో బండి సంజయ్, మాజీ మంత్రి ఈటల రాజేందర్ తో కూడ ఆమె సమావేశమయ్యారు. కానీ ఆమె బీజేపీలో చేరలేదు. ఇప్పుడు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జీ మాణిక్ రావు ఠాక్రే సమక్షంలో ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. వెంటనే పార్టీ తరపు ప్రచారం చేయాలని సూచించారు. అదే విధంగా కాంగ్రెస్ పార్టీలో ప్రాధాన్యత కల్పిస్తామని.. కీలక బాధ్యతలు అప్పగిస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications