కొండా సురేఖ వ్యాఖ్యలపై రకుల్ ప్రీత్ సింగ్ స్పందన: ఏమన్నారంటే?
టాలీవుడ్ సినీ నటులపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లోనేగాక, దేశ వ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను విమర్శించే క్రమంలో ప్రముఖ సినీనటులు నాగార్జున, సమంత, నాగచైతన్యలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. సమంత, నాగచైతన్యల విడాకులకు కేటీఆరే కారణమని, కేటీఆర్ కారణంగా కొందరు హీరోయిన్లు త్వరగా పెళ్లి చేసుకుని ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోయారని కొండా సురేఖ ఆరోపించారు.
ఈ సందర్భంగా సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Pree Singh) పేరును కూడా మంత్రి కొండా సురేఖ (Konda Surekha) ప్రస్తావించారు. ఈ నేపథ్యంలోనే రకుల్ ప్రీత్ సింగ్ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించారు. మీ రాజకీయ ప్రయోజనాల కోసం తన పేరును ఎందుకు వాడుకుంటున్నారని అసహనం వ్యక్తం చేశారు.

'సృజనాత్మత, వృత్తి నైపుణ్యానికి తెలుగు చలనచిత్ర పరిశ్రమ ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ఈ అందమైన తెలుగు ఇండస్ట్రీలో తనది గొప్ప ప్రయాణం. ఇప్పటికీ ఇండస్ట్రీతో సత్సంబంధాలు కలిగి ఉన్నాను. ఒక మహిళ గురించి దారుణమైన, దుర్మార్గమైన నిరాధార ఆరోపణలు చేయడం విని బాధగా అనిపించింది. బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న మరో మహిళ ఇలా వ్యాఖ్యానించడం మరింత బాధించింది' అని రకుల్ ప్రీత్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు.
అంతేగాక, హుందాగా వ్యవహించాలనే ఉద్దేశంతోనే తామంతా నిశ్వబ్ధంగా ఉన్నామని.. కానీ, అదే తమ బలహీనత అనుకోవద్దని రకుల్ ప్రీత్ సింగ్ స్పష్టం చేశారు. నేను రాజకీయాలకు దూరంగా ఉండే వ్యక్తిని. నాకు ఏ వ్యక్తి/రాజకీయ పార్టీతో సంబంధం లేదు. రాజకీయ ప్రయోజనాల కోసం నా పేరును ఉపయోగించవద్దని కోరుతున్నా. నటులు, సృజనాత్మకత కలిగిన వ్యక్తులను రాజకీయాలకు దూరంగా పెట్టండి. వార్తల్లో నిలిచేందుకు వారి పేర్లను వాడుకుని కల్పిత కథనాలను సృష్టించవద్దని రకుల్ ప్రీత్ సింగ్ హితవు పలికారు.
Telugu Film Industry is known worldwide for its creativity and professionalism. I've had a great journey in this beautiful industry and still very much connected.
— Rakul Singh (@Rakulpreet) October 3, 2024
It pains to hear such baseless and vicious rumours being spread about the women of this fraternity. What's more…
మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై ఇప్పటికే సినీ పెద్దలు, నటులు తీవ్ర నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. సినీ నటులను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవద్దని, నిరాధార ఆరోపణలు చేసి కించరిస్తే చూస్తూ ఊరుకోబోమంటూ హెచ్చరిస్తున్నారు. మరోవైపు, కొండా సురేఖ వ్యాఖ్యలపై నాగార్జున పరువు నష్టం దావా వేశారు. క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ హైదరాబాద్ నాంపల్లి కోర్టును ఆశ్రయించారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications