తోటమాలి పెళ్లిలో కలెక్టర్ దివ్య సందడి, డ్యాన్స్ చేసి ఆకట్టుకున్నారు(వీడియో)
Recommended Video

ఆదిలాబాద్: తమ కార్యాలయంలో అటెండర్(తోటమాలి)గా పనిచేసే వ్యక్తి పెళ్లికి విశిష్ట అతిథిగా హాజరయ్యారు జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్. అంతేగాక, వివాహ వేడుకకు వచ్చిన ఆదివాసీ మహిళలతో కలిసి ఆడిపాడారు. వారితో కలిసి గిరిజనుల సంప్రదాయ థింసా నృత్యం చేసి ఆకట్టుకున్నారు.
ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో అటెండర్‌గా పనిచేస్తున్న సుధాకర్ తన వివాహానికి రావాలని జిల్లా కలెక్టర్ దివ్యకు శుభలేఖ ఇచ్చాడు. చిరుద్యోగి అని చిన్నచూపు చూడకుండా ఆమె వివాహ వేడుకలకు హాజరై హుందాతనాన్ని చాటుకున్నారు.

గుడిహత్నూర్ మండలంలోని గోపాల్‌పూర్ గ్రామంలో అతని శుక్రవారం వివాహం జరిగింది. తన క్యాంపు కార్యాలయంలో అటెండర్‌గా పనిచేస్తూ క్యాంపు కార్యాలయం ఆవరణలో ఉన్న తోటను చూసుకునే సుధాకర్ వివాహానికి హాజరైన కలెక్టర్.. ఎలాంటి అధికార దర్పం చూపకుండా అక్కడి జనంతో మమేకమయ్యారు.
#MustWatch #Adilabad Collector Divya Devarajan not only attended the wedding of Sudhakar- the gardener of the Adilabad collector camp office, but also danced and was part of the tribal celebrations. She couldn't have made him happier :) #Telangana #SpreadASmile pic.twitter.com/9uiv6u8VTn
— PAUL OOMMEN (@Paul_Oommen) May 7, 2018
సుధాకర్ బంధువులతో మాట్లాడుతూ సరదాగా గడిపారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. జిల్లా కలెక్టర్ వివాహానికి రావడంతో గోపాల్‌పూర్ గ్రామంలో సందడి నెలకొంది. వివాహానికి వచ్చిన అతిథులే కాకుండా గ్రామస్తులంతా జిల్లా కలెక్టర్‌ను ఆప్యాయంగా కలుసుకున్నారు. ఆమెతో ఫొటోలు దిగారు.












Click it and Unblock the Notifications