ఏజెంట్ మోసం: ఉద్యోగం రాక మలేసియాలో అదిలాబాద్‌వాసి మృతి

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని అదిలాబాద్ జిల్లా సత్తెనపల్లికి చెందిన ఓ వ్యక్తి మలేషియాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. అతని పేరు మలావత్ దేవ్ సింగ్. అతను ఉద్యోగం నిమిత్తం గత నెల మలేషియా వెళ్లారు.

ఏ ఏజెంట్ ద్వారా ఉద్యోగం కోసం అతను వెళ్లారు. ఏజెంట్ మోసం చేయడంతో అతనికి ఉద్యోగం రాలేదు. దీంతో అతను ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అతను మృతి చెందినట్లు తెలుగు ప్రవాసితుల సంఘం భారత హైకమిషనర్‌కు సమాచారం అందించింది. అతనిని హైదరాబాద్ తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Adilabad district man dies in Malaysia

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
It is said that Adilabad district man Malavat Devsing dies in Malaysia.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి