దేశంలో అత్యధిక క్రిమినల్ కేసులున్న సీఎంగా రేవంత్ రెడ్డి..రెండో స్థానంంలో ఎవరంటే ..?

కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత, గత రెండు పర్యాయాల కంటే మరింత దూకుడుగా సంస్కరణలను చేపడుతోంది. ఇందులో భాగంగానే ఇటీవల 130వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ బిల్లు ప్రకారం, ఒక ప్రజాప్రతినిధి 30 రోజులు వరుసగా కస్టడీలో ఉంటే, ఆ తర్వాత 31వ రోజున ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, కేంద్ర, రాష్ట్ర మంత్రులు తమ పదవులను ఆటోమేటిక్‌గా కోల్పోతారు.

ఈ నేపథ్యంలో, 'అసోసియేట్ ఫర్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్' (ADR) విడుదల చేసిన నివేదిక దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. దేశంలోని 31 మంది ముఖ్యమంత్రులపై ఉన్న క్రిమినల్ కేసుల వివరాలను ఈ నివేదిక వెల్లడించింది.

ADR Report Revanth Reddy Tops List of CMs with Criminal Cases Followed by Stalin and Chandrababu

ఈ నివేదిక ప్రకారం, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 89 కేసులతో ఈ జాబితాలో మొదటి స్థానంలో నిలిచారు. వీటిలో 72 తీవ్ర నేరారోపణలకు సంబంధించిన క్రిమినల్ కేసులు ఉన్నాయి. తమిళనాడు సీఎం ముత్తువేల్ కరుణానిధి స్టాలిన్ 42 కేసులతో రెండో స్థానంలో ఉన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై 19 కేసులు, అందులో 32 తీవ్ర నేరారోపణలు ఉన్నట్లు నివేదిక పేర్కొంది.

మొత్తం 31 మంది ముఖ్యమంత్రులలో, 13 మందిపై తీవ్ర నేరారోపణలతో కూడిన క్రిమినల్ కేసులు ఉన్నాయని ADR తెలిపింది. వీరిలో హత్యా యత్నం, కిడ్నాప్, వేధింపులు, లంచం వంటి తీవ్ర నేరారోపణలు ఉన్నాయి. ఈ తీవ్ర నేరారోపణలు రుజువైతే, గరిష్టంగా ఐదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

ఈ నివేదిక ముఖ్యమంత్రులపై ఉన్న క్రిమినల్ కేసుల సంఖ్యను వెల్లడించడమే కాకుండా, భారత రాజకీయాల్లో ఉన్న అపారమైన వైరుధ్యాలను కూడా ఎత్తి చూపుతోంది. ఈ పరిస్థితులు, ప్రజాప్రతినిధుల పారదర్శకత, జవాబుదారీతనంపై చర్చను మరింత పెంచే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+