రాజ్ భవన్ లో కేసీఆర్ - మంత్రులతో సహా : 9 నెలల తరువాత - ఒక్క ఎంట్రీతో..!!

రాజకీయ సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ అయిన సీఎం కేసీఆర్ మరో సారి కీలక అడుగు వేసారు. ఒక్క ఎంట్రీతో పలు విమర్శలకు సమాధానం చెప్పారు. విపక్షాలకు విమర్శలకు అవకాశం లేకుండా చేసారు. దాదాపు 9 నెలల గ్యాప్ తరువాత ప్రగతి భవన్ నుంచి సీఎం కేసీఆర్ రాజ్ భవన్ కు వచ్చారు. గవర్నర్ తో సమావేశమయ్యారు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారంలో పాల్గొన్నారు. ప్రోటోకాల్ ప్రకారం గవర్నర్ చేయించే ఈ ప్రమాణ స్వీకారంలో సీఎంతో పాటుగా మంత్రులు..సీఎస్ ..డీజీపీ హాజరు కావాల్సి ఉంది.

సీఎంతో పాటుగా మంత్రులు

సీఎంతో పాటుగా మంత్రులు


అయితే, కొంత కాలంగా ప్రభుత్వం వర్సెస్ గవర్నర్ అన్నట్లుగా సాగుతున్న పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ హాజరవుతారా లేదా అనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో మొదలైంది. టీఆర్ఎస్ తో సహా విపక్షాలు సైతం ఆసక్తిగా ఎదురు చూసాయి. ఈ సమయంలో.. సీఎం కేసీఆర్ రాజ భవన్ లో సడన్ ఎంట్రీ ఇచ్చారు. అన్నింటికీ సమాధానం చెప్పారు. ఈ ఎంట్రీ ద్వారా గవర్నర్ - ప్రభుత్వం మద్య గ్యాప్ పూర్తిగా తొలిగినా.. లేకపోయినా.. కేసీఆర్ వేసిన తొలి అడుగు మాత్రం టీఆర్ఎస్ ప్రభుత్వం పైన ఈ వ్యవహారంలో విమర్శలకు ముగింపు పలికేందుకు దోహద పడే ఛాన్స్ కనిపిస్తోంది.

వివాదానికి ముగింపు .. కొత్త అడుగులు

వివాదానికి ముగింపు .. కొత్త అడుగులు

గవర్నర్ తో ప్రభుత్వ వివాదం పైన ప్రతిపక్షాలు.. సీఎం ను టార్గెట్ చేస్తున్నాయి. ఇక, మరో నాలుగు రోజుల్లో హైదరాబాద్ కేంద్రంగా బీజేపీ జాతీయ కార్యకవర్గ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు వస్తున్న ప్రధాని మోదీ రాజ్ భవన్ లోనే బస చేయనున్నారు. గత నెలలో ప్రధాని హైదరాబాద్ వచ్చిన సమయంలోనూ సీఎం కేసీఆర్ దూరంగానే ఉన్నారు. ఈ సారి పార్టీ కార్యక్రమాల కోసం ప్రధాని వస్తున్న వేళ.. సీఎం కలిసే అవకాశం లేదు. జాతీయ పార్టీ ఏర్పాటు కసరత్తులో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న సీఎం కేసీఆర్.. ప్రభుత్వం వర్సెస్ గవర్నర్ అనే వివాదానికి ముగింపు పలకాలనే ఆలోచనకు వచ్చినట్లుగా స్పష్టం అవుతోంది.

గ్యాప్ ఇక సమిసిసోయినట్లేనా

గ్యాప్ ఇక సమిసిసోయినట్లేనా

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం వేళ.. నగరంలోనే ఉంటూ హాజరు కాకుంటే విమర్శలకు అవకాశం ఏర్పుడుతుందనే అంచనాకు వచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతో..ఇప్పుడు కేసీఆర్ దాదాపు 9 నెలలు తరువాత తన మంత్రులు.. అధికారులతో కలిసి రాజ్ భవన్ కు రావటం. .గవర్నర్ తో కలిసి అధికారిక కార్యక్రమంలో పాల్గొనటం ఇప్పడుు పొలిటికల్ సర్కిల్స్ లో బిగ్ డిబేట్ కు ..భవిష్యత్ సంబంధాల పైన ఆసక్తి కర చర్చకు కారణంగా నిలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+