అఘోరీ మాత వ్యవహారంలో ఊహించని షాకింగ్ ట్విస్ట్. సిద్ధిపేట సిఐ సెన్సేషన్!

తెలంగాణ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా ఒక అఘోరి హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. నిన్నటికి నిన్న లేడీ అఘోరీ మాత హైవే మీద రెచ్చిపోయి తనపై ట్రోలింగ్ చేసిన వారి అంతు చూస్తానని హెచ్చరించారు. ముత్యాలమ్మ ఆలయంలో విగ్రహాన్ని కాలితో తన్నిన ఘటన పైన హిందూ సంఘాలు భగ్గుమన్న సమయంలో ఒక అఘోరిమాత అక్కడికి వచ్చి ముత్యాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

తెలంగాణలో అఘోరీ.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు
ఇక అప్పటి నుంచే సెన్సేషనల్ గా మారిన అఘోరి ఇలాంటి ఘటనకు పాల్పడిన వారిని వదలొద్దని పేర్కొన్నారు. మన ధర్మాన్ని కాపాడుకుంటూనే ఇతర ధర్మాలను గౌరవించాలని సూచించారు. అయితే ఆమె అఘోరీ కాదని డబ్బుల కోసం ఈ విధంగా నటిస్తుందని పలువురు ఆమెను ట్రోల్ చేస్తున్నారు.

Aghori issue An unexpected shocking twist Siddipet CI Sensational comments on aghori

పోలీసులను ఆశ్రయించిన అఘోరీ

ఈ క్రమంలో తనను ట్రోల్ చేసిన వాళ్ళ అంతం చూస్తానని చెప్పిన అఘోరి హైవే మీద శివతాండవం చేశారు. ఆ తర్వాత నిన్న రాత్రి అఘోరీ సిద్దిపేట పోలీసులను ఆశ్రయించారు. తనపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని స్థానిక త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పలు యూట్యూబ్ ఛానల్ ల పైన ఫిర్యాదు చేసిన అఘోరి వారి పైన చర్యలు తీసుకోవాలని కోరారు.

అఘోరీ ఫిర్యాదుపై సిద్ధిపేట సిఐ సెన్సేషన్
ఇక ఇదే విషయాన్ని సిద్దిపేట త్రీ టౌన్ సిఐ విద్యాసాగర్ వెల్లడించారు. రాత్రి పది గంటల సమయంలో శివ విష్ణు బ్రాహ్మణి అనే పేరు ఉన్న అఘోరి సోషల్ మీడియాలో తనపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని యూట్యూబ్ ఛానల్ పైన చర్యలు తీసుకోవాలని పిటిషన్ ఇచ్చారని అఘోరీ ఫిర్యాదు మేరకు విచారణ చేయనున్నామని తెలిపారు.

అఘోరీ మహిళ కాదు .. ఎవరంటే
తన పరువుకు భంగం కలిగింది అనుకుంటే ఆమె కోర్టులో పరువు నష్టం దావా కూడా వేయవచ్చని సీఐ పేర్కొన్నారు. అయితే అఘోరీగా చెప్పుకుంటున్న శివ విష్ణు బ్రాహ్మణి మహిళ కాదని ఆమె ఒక ట్రాన్స్ జెండర్ అని తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లా కుషన్ పల్లి కి చెందిన చిన్నయ్య, చిన్నక్క దంపతుల మూడవ సంతానమని తెలిసింది.

తెలంగాణ రాష్ట్రంలో సెన్సేషన్ గా అఘోరీ వ్యవహారం
ప్రస్తుతం అఘోరీగా చెప్పుకుంటున్న వ్యక్తి పురుషుడని ఆ తరువాత ట్రాన్స్టెండర్ గా మారాడని ఆపై ఇప్పుడు అఘోరీగా తిరుగుతున్నాడని తెలిసింది. ఏమైనా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో సెన్సేషన్ గా మారిన అఘోరి తనను ట్రోల్ చేస్తున్న వారి పైన కేసు పెట్టడం ఆసక్తిని రేకెత్తిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+