మహేష్ గౌడ్ కే పీసీసీ పగ్గాలు - ఏఐసీసీ నిర్ణయం వెనుక..!!

టీపీసీసీకి కొత్త అధ్యక్షుడు ఖరారయ్యారు. నూతన అధ్యక్షుడిని నియమిస్తూ ఏఐసీసీ అధికారికంగా నిర్ణయం ప్రకటించింది. బీసీ వర్గానికే పీసీసీ పగ్గాలు అప్పగించింది. సుదీర్ఘ కసరత్తు తరువాత పీసీసీ కొత్త చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ పేరును ఖరారు చేసింది. ఈ పదవి కోసం చివరి వరకు పలువురు పోటీ పడినా..ముఖ్యమంత్రి రేవంత్ ఛాయిస్ కే పార్టీ అధినాయకత్వం మొగ్గు చూపింది. విద్యార్ది సంఘ నేతగా మొదలై నేడు మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ పగ్గాలు చేపడుతున్నారు.

మహేష్ కే పగ్గాలు
బీసీ వర్గానికి చెందిన ప్రస్తుత టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్...ఎమ్మెల్సీగా ఉన్న బొమ్మ మహేష్ గౌడ్ పేరు టీపీసీసీ అధ్యక్షుడిగా పార్టీ నాయకత్వం ఖరారు చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ కాంగ్రెస్ లోకి వచ్చిన సమయం నుంచి పీసీసీ అధ్యక్షుడుగా..సీఎం అయిన సమయంలోనూ మహేష్ పూర్తి మద్దతుగా నిలిచారు. రేవంత్ కు వ్యతిరేకంగా నాడు పార్టీలో వ్యతిరేక గళం వినిపించిన వారికి ధీటుగా మహేష్ సమాధానం ఇచ్చారు. దీంతో, తన లక్ష్యాలకు అనుగుణంగా పార్టీని ముందుకు తీసుకెళ్లే క్రమంలో రేవంత్ టీపీసీసీ చీఫ్ గా మహేష్ వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.

AICC Annunces Mahesh Kumar Goud as TPCC new Chief

ఏఐసీసీ నిర్ణయం వెనుక
అయినా...ఏఐసీసీ టీపీసీసీ నియామకం పైన సుదీర్ఘ కసరత్తు చేసింది. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, ఉత్తమ్ తో సుదీర్ఘ మంతనాలు సాగించింది. సామాజిక సమీకరణాల ఆధారంగా టీపీసీసీ చీఫ్ నియామకం చేయాలని నిర్ణయించింది. బీసీ, గిరిజన, ఎస్సీ నేతల నుంచి ముగ్గురు పేర్ల పైన చర్చ జరిగింది. తెలంగాణలో వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా వ్యవహరించాలని నిర్ణయించింది. అందులో భాగంగా రేవంత్ కు సహకారం అందిస్తూ త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలు..మిషన్ 2028 లక్ష్యంగా టీపీసీసీ చీఫ్ ఎంపిక ఉండాలని పార్టీ కసరత్తు చేసింది.

మిషన్ 2028
దక్షిణ తెలంగాణకి చెందిన వ్యక్తి కావడంతో.. ఉత్తర తెలంగాణ నేతకి పీసీసీ చీఫ్ ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. ఎన్‌ఎస్‌యూఐ నుంచి అనేక హోదాల్లో మహేష్ కాంగ్రెస్ లో పని చేసారు. రేవంత్ సీఎం అయిన తరువాత మహేష్ ఫేట్ మారిపోయింది. ఈ ఏడాది జనవరి 29న తెలంగాణ శాసనమండలిలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అయ్యారు. ఇక ఇప్పుడు టీపీసీసీ చీఫ్‌గా పదవిని అలంకరించబోతున్నారు. టీపీసీసీ పదవి బీసీ వర్గానికి ఇవ్వటంతో..ఇక ఇప్పుడు మహేష్ గౌడ్ రేవంత్ తో కలిసి త్వరలో జరిగే స్థానిక సంస్థల్లోనూ...2028 ఎన్నికల లక్ష్యంగా రేవంత్ తో కలిసి పార్టీని ముందుకు నడిపించాల్సి ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+