సిఎం పదవిపై జానారెడ్డి ఆసక్తికరం: రేసులో వెనక్కు, 2019 లో అధికారమే టార్గెట్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరబాద్: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి ఎవరనే విషయాన్ని పార్టీ అధిష్టానం నిర్ణయిస్తోందని సిఎల్పీ నాయకుడు జానారెడడి ప్రకటించారు. అయితే తమ ముందున్న కర్తవ్యం వచ్చే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావడమేనని ఆయన చెప్పారు.

2019 ఎన్నికల్లో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలనపు సిద్దం చేస్తోంది. మెదక్ జిల్లాలో రాహుల్ గాంధీ సభ సక్సెస్ కావడంతో ఉస్మానియా యూనివర్శిటీలో రాహుల్ సభ ఏర్పాటుకు సన్నద్దమయ్యారు.

మూడేళ్ళపాటు స్ధబ్దుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల కసం పార్టీ క్యాడర్ లో ఉత్సాహం నింపేందుకు చర్యలను తీసుకొంటున్నారు. రానున్న ఎన్నికల్లో అధికారాన్ని కైవసం చేసుకొంటామని పార్టీ క్యాడర్ లో ధైర్యాన్ని నింపుతున్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత పార్టీ అధికారంలోకి రాలేదు. అయితే తక్కువ స్థానాల్లో మాత్రమే ఆ పార్టీ విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ తరపున విజయం సాధించిన ఎమ్మెల్యేలు కూడ ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా అధికారపార్టీలో చేరారు..

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
AICC will decide who is the next cm after 2019 elections said CLP leaders K.Janareddy on Fridy at Huzurnagar.he slams to Trs governament.
Please Wait while comments are loading...