Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఎంఐఎం పార్టీకి మాజీ కార్పొరేటర్ ఖాజా బిలాల్ రాజీనామా: ‘గోషామహల్’ సీటే కారణం

హైదరాబాద్: ఏఐఎంఐఎం నేత, మాజీ కార్పొరేటర్ ఖాజా బిలాల్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. గోషామహల్ నుంచి ఒవైసీ పార్టీ ఎందుకు పోటీ చేయలేదని ఆయన ప్రశ్నించారు. తాను గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఏఐఎంఐఎం టికెట్‌ డిమాండ్‌ చేశానని, కానీ, ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ ఇవ్వలేదని ఆరోపించారు.

గోషామహల్‌లో 80,000 మంది ముస్లిం ఓటర్లు ఉన్నారని, అనివార్య కారణాల వల్ల ఏఐఎంఐఎం అక్కడి నుంచి పోటీ చేయడం లేదని తెలిపారు. "ప్రణాళిక ప్రకారం అసదుద్దీన్ ఒవైసీ అభ్యర్థిని నిలబెట్టలేదు. ఎంఐఎం అధ్యక్షుడు అభ్యర్థిని నిలబెట్టాలి' అని ఖాజా డిమాండ్ చేశారు.

AIMIM leader and former corporator Khaja Bilal resigned from the party

గోషామహల్ బీజేపీ అభ్యర్థి రాజా సింగ్‌ను ఎదుర్కోవడానికి ఏఐఎంఐఎం పార్టీకి ఎలాంటి వ్యూహం లేదు. ఎఐఎంఐఎం అభ్యర్థిని నిలబెట్టకపోవడంతో రాజా సింగ్ 2014 ఎన్నికల నుంచి గెలుస్తూ వస్తున్నారు. గోషామహల్‌లో అభ్యర్థిని ప్రకటించకుండా ఒవైసీ, బీజేపీ కుట్ర పన్నాయని ఆరోపించారు ఖాజా బిలాల్.

బీఆర్ఎస్, ఎంఐఎం ఒకరికొకరు మద్దతు ఇచ్చుకుంటున్నారని అనుకుంటే.. గోషామహల్ నుంచి ఎంఐఎం తరపున బీఆర్ఎస్ ఓ పెద్ద హిందూ నేతను పోటీ చేయించవచ్చు కాదా? అని ఖాజా ప్రశ్నించారు. కాగా, గోషామహల్ నుంచి బీఆర్ఎస్ పోటీ చేస్తుండగా.. ఎంఐఎం పోటీ చేయని విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన టికెట్ ఆశించి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.

మరోవైపు, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా ఎంఐఎంను ఈ విషయంపై ప్రశ్నించిన విషయం తెలిసిందే. గోషామహల్ నుంచి ఎంఐఎం ఎందుకు పోటీ చేయడం లేదని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం ఒక్కటేనని రేవంత్ ఆరోపించారు.

అయితే, బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాజా సింగ్ కూడా గోషామహల్ నుంచి ఎంఐఎం పోటీ చేయాలని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ అభ్యర్థికి లబ్ధి చేకూర్చే ప్రయత్నంలో భాగంగానే ఎంఐఎం తమ పార్టీ అభ్యర్థిని ఇక్కడ నిలబెట్టలేదని ఆరోపించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+