అల‌ర్ట్‌.. న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో నేడు క‌రెంట్ బంద్‌..

హైద‌రాబాద్‌లోని బంజారాహిల్స్‌ ఏడీఈ పరిధిలోని ప‌లు ప్రాంతాల్లో నేడు (బుధవారం) విద్యుత్ స‌ర‌ఫ‌రా బంద్‌... మరమ్మతుల కారణంగా న‌గ‌రంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్ప‌డుతున్న‌ట్లు ఏడీఈ జి.గోపి పేర్కొన్నారు. నేటి ఉదయం ప‌ది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు కరెంట్ బంద్ ఉంటుంద‌న్నారు.

బంజారాహిల్స్ ఏడీఎ ప‌రిధిలోని ఎన్‌బిటీ నగర్‌, చిరాన్‌ ప్యాలెస్‌, మేయర్‌ విజయలక్ష్మి ఇల్లు, మిథిలానగర్‌, ఎస్‌ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, మారుతీనగర్‌, బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 12, ఎస్‌కే నగర్‌, టెన్నిస్‌ కోర్ట్‌, ప్రగతి నగర్‌, మారుతినగర్‌ ఫీడర్ల పరిధిలోని లాపలమ్మ అపార్టుమెంట్ ప్రాంతాల్లో ఉద‌యం నుంచి మ‌ధ్యాహ్నం వ‌ర‌కు క‌రెంట్ ఉండ‌దు. అలాగే, యూసుఫ్‏గూడ బస్తీ ప్రాంతాల్లోని గురుద్వారా ఫీడర్ల పరిధిలోని ఆనంద్‌ బంజారా కాలనీ, కనకదుర్గ టెంపుల్‌, దుర్గా ఎన్‌క్లేవ్‌, యాదగిరినగర్‌, రహమత్‌నగర్‌, గురుద్వారాల‌లో మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం 5 గంట‌ల వరకు విద్యుత్ స‌ర‌ఫ‌రాలో తీవ్ర అంత‌రాయం ఏర్ప‌డుతున్న‌ట్లు అధికారులు తెలిపారు.

Alert Power outage in many areas of the city today

గ్రీన్‌ల్యాండ్స్‌ ఏడీఈ పరిధిలో..

ఈ ప్రాంతాల‌తో పాటు గ్రీన్‌ల్యాండ్స్‌ ఏడీఈ పరిధిలోని పలు ప్రాంతాల్లో కూడా మరమ్మతుల కారణంగా క‌రెంట్ స‌ర‌ఫ‌రా ఉండ‌ద‌ని అధికారులు చెబుతున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు రేణుక ఎల్లమ్మ టెంపుల్‌, రేణుక నగర్‌, ఎల్లమ్మ టెంపుల్‌, జనప్రియ ఫీడర్ల పరిధిలోని బల్కంపేట, జనప్రియ అపార్టుమెంట్‌ ప్రాంతాల్లో క‌రెంట్ ఉండ‌దు. అలాగే, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంట‌ల వరకు న్యూశాస్త్రీ నగర్‌ ఫీడర్ల పరిధిలోని డీకే రోడ్‌, శివభాగ్‌, అవంతినగర్‌, పీఆర్‌ నగర్‌, న్యూశాస్త్రీ నగర్ ప్రాంతాల్లో కూడా విద్యుత్ స‌ర‌ఫరాలో తీవ్ర అంత‌రాయం ఏర్ప‌డుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+