రైతులకు కీలక అలెర్ట్.. రేపటి నుండి అవి బంద్!

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పత్తి సాగు చేసిన రైతులకు ఒక కీలక అప్డేట్ ఇచ్చింది సిసిఐ. ఆరుగాలం శ్రమించి పంట పండించిన పత్తి రైతులు మార్కెట్లో పత్తిని అమ్ముకోవడానికి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, కొనుగోళ్లను చేపట్టింది. పత్తి రైతులకు నష్టం జరగకుండా ఉండేందుకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రైతులకు మద్దతు ధర చెల్లించి పత్తిని కొనుగోలు చేస్తుంది.

రేపటితో ముగియనున్న పత్తి కొనుగోళ్ళు

రాష్ట్రవ్యాప్తంగా ఈ పత్తి కొనుగోళ్లు రేపటితో ముగియనున్నాయి అని సీసీఐ కీలక అలర్ట్ ఇచ్చింది. భారత పత్తి సంస్థ ఈనెల 20వ తేదీ వరకే జిన్నింగ్ మిల్లులలో పత్తి కొనుగోళ్లు చేపడుతుందని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి మల్లేశం పేర్కొన్నారు. రైతులు ఈనెల 20వ తేదీ వరకే తమ పత్తి సరుకును, సీసీఐ కొనుగోలు కేంద్రాలలో విక్రయించి, మద్దతు ధర పొందాలని ఆయన సూచించారు.

alert to farmers from tomorrow cci closing cotton purchase CCI has procured around 148 lakh quintals of cotton in Telangana

11,800 కోట్ల రూపాయల పత్తి కొనుగోలు చేసిన సీసీఐ

మరోవైపు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా పత్తి కొనుగోలు రేపటితో నిలిచిపోతాయని సిసిఐ తెలిపింది. గత అక్టోబర్ నుంచి ఇప్పటివరకు సీసీఐ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 148 లక్షల క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేసింది. దాదాపు 29.50 లక్షల బేళ్ళ పత్తిని సీసీఐ కొనుగోలు చేసింది. సుమారు ఇది 11,800 కోట్ల రూపాయలకు సమానమని తెలుస్తోంది.

8.60 లక్షల మంది రైతుల నుండి పత్తి కొనుగోళ్ళు

ఫిబ్రవరి 12వ తేదీ వరకు సిసిఐ రాష్ట్రవ్యాప్తంగా 8.60 లక్షల మంది రైతుల నుండి పత్తిని కొనుగోలు చేసింది. కపాస్ కిసాన్ యాప్ ద్వారా స్లాట్ బుక్ చేసి పత్తి రైతులు తమ పత్తిని విక్రయించుకునే సౌకర్యాన్ని కల్పించింది సిసిఐ. అయితే మొదట్లో స్మార్ట్ ఫోన్లు లేని రైతులు, ఇబ్బంది పడినప్పటికీ తర్వాత అధికారులు నిర్వహించిన అవగాహన కార్యక్రమాలతో ప్రస్తుతం పరిస్థితి కాస్త మెరుగుపడింది.

ఇప్పుడే స్లాట్ బుక్ చేసుకుని పత్తి విక్రయించండి

అయితే రేపటి తోటి సీసీఐ కొనుగోళ్ళు ముగియనున్న నేపథ్యంలో రైతులు వెంటనే స్లాట్ బుక్ చేసుకుని నిబంధనల ప్రకారం పత్తిని విక్రయించి మద్దతు ధర పొందాలని అధికారులు సూచిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పత్తి కొనుగోలు చేస్తున్న అన్ని కేంద్రాల్లోనూ రేపటితోనే గడువు ముగియనున్నట్టు స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+