గోవా వెళ్తున్నారా? అయితే వీళ్ళతో జాగ్రత్త!

ఆహ్లాదాన్ని ఇచ్చే పర్యాటక ప్రదేశం గోవా వెళ్లాలని భావిస్తున్నారా? అయితే బి అలర్ట్.. గోవా పర్యటన చేసే ప్రేమ జంటలకు తాజాగా జరిగిన ఒక ఘటన తీవ్ర హెచ్చరికను జారీ చేస్తుంది. గోవా పర్యటనలు చేసే ప్రేమ జంటలకు హైదరాబాదులో వెలుగు చూసిన ఒక బ్లాక్ మెయిల్ ఘటన ఊహించని షాక్ ఇస్తోంది.

ప్రియుడితో కలిసి గోవా వెళ్ళిన మహిళ
ముఖ్యంగా టెంపరరీ అకామిడేషన్ కోసం, ప్రైవేట్ అకామిడేషన్ ఎంచుకున్నప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలన్న విషయాన్ని ఈ ఘటన సూచిస్తుంది. 2003లో హైదరాబాద్లోని ఎర్రగడ్డ కు చెందిన 35 ఏళ్ల మహిళ తన ప్రియుడితో కలిసి గోవా వెళ్ళింది. అక్కడ వారు బస చేయడానికి వారి ప్రయాణ ఏర్పాట్లను చూడడానికి యశ్వంత్ అనే వ్యక్తి పని చేశాడు.

alert to lovers who are going Goa Trip a man blackmailed Hyderabad Woman with photos videos

ప్రియుడితో సన్నిహితంగా ఉన్న ఫోటోలు, వీడియోలతో బ్లాక్ మెయిల్
అతను గోవాలో హోటల్స్, అపార్ట్మెంట్ల నిర్వహణ బాధ్యతలను చూసుకునేవాడు. అయితే ఇటీవల ఆ మహిళకు యశ్వంత్ నుంచి ఊహించని ఒక ఫోన్ వచ్చింది. గోవా ట్రిప్ లో సదరు మహిళ ప్రియుడుతో సన్నిహితంగా ఉన్న ప్రైవేటు వీడియోలను, ఫోటోలను రహస్యంగా తీశానని, తనకు డబ్బులు ఇవ్వకపోతే ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని, ఆమె భర్తకు పంపుతానని హెచ్చరిస్తూ ఫోన్ చేశాడు.

౩౦ లక్షలు ఇవ్వాలని డిమాండ్, పోలీసులను ఆశ్రయించిన మహిళ
ఈ బెదిరింపు ఫోన్ కాల్స్ తో భయపడిన సదరు మహిళ తన వైవాహిక జీవితం నాశనం అయిపోతుందని అతడిని బతిమిలాడింది. తనను డబ్బులు అడగవద్దని ప్రాధేయపడింది. అయినా సరే 30 లక్షల రూపాయలు ఇస్తే ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేస్తానని, లేదంటే తర్వాత నువ్వే ఇబ్బంది పడాల్సి వస్తుందని మహిళ పైన మరింత ఒత్తిడి పెంచాడు.దీంతో బాధితురాలు చేసేదేమీ లేక సనత్ నగర్ పోలీసులను ఆశ్రయించింది.

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
పోలీసుల కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. మహిళను బ్లాక్ మెయిల్ చేసిన, బెదిరింపులకు పాల్పడిన సదరు వ్యక్తిపై bns యాక్ట్ ప్రకారం వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇక ఈ గోవా ఘటనకు సంబంధించిన సాక్ష్యాలను, నిందితుడి ఆచూకీని సేకరిస్తున్న సనత్ నగర్ పోలీసులు గోవా వెళుతున్న వారికి హెచ్చరికలు జారీ చేశారు.

గోవా వెళ్ళే ప్రేమ జంటలకు అలెర్ట్
పర్యాటక ప్రాంతాలకు వెళ్ళే జంటలు ప్రైవేట్ బస ఎంపికలు, వ్యక్తిగత గోప్యత పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని తాజా ఉదంతంతో అర్థమవుతుంది. గోవాలో ఎంజాయ్ చేయాలనుకునే ప్రేమ జంటలు ఇకనైనా మిమ్మల్ని గమనించి, మీ వీడియోలు, ఫోటోలు రికార్డ్ చేసి బెదిరించే వారు ఉంటారు అన్న విషయాన్ని గుర్తించి జాగ్రత్తగా ఉండాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+