తెలంగాణలో పది ఫలితాల ముహూర్తం ఖరారు - మార్కుల్లో మార్పులు..!!
తెలంగాణలో పదో తరగతి ఫలితాల ముహూర్తం ఖరారైంది. ఈ మేరకు విద్యా శాఖ అధికారులు తుది కసరత్తు చేస్తున్నారు. దాదాపు అయిదు లక్షల మంది విద్యార్ధులు ఫలితాల కోసం ఉత్కంఠ గా నిరీక్షిస్తున్నారు. గ్రేడింగ్ విధానం పైన ప్రభుత్వ తుది నిర్ణయం కోసం ఫలితాల విషయంలో అధికారులు వేచి చూసారు. ఇప్పుడు ప్రభుత్వం నుంచి స్పష్టత రావటంతో ఇక ఫలితాల వెల్లడికి లైన్ క్లియర్ అయింది. గతం కంటే భిన్నంగా ఈ సారి ఫలితాలను వెంటనే తెలుసుకునే విధంగా కొత్తగా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.
ఫలితాల ముహూర్తం
తెలంగాణలో ఈ నెల 30న పదో తరగతి ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఇందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఫలితాలను డిప్యూటీ సీఎం భట్టి విడుదల చేసేందుకు నిర్ణయించారు. వాస్తవానికి పదో తరగతి మూల్యాంకనం, మార్కుల కంప్యూట రీకరణ, పరిశీలన ప్రక్రియ వారం రోజుల క్రితమే పూర్తయింది. విద్యా శాఖ ప్రస్తుతం సీఎం రేవంత్ ఆధీనంలోనే ఉంది. సీఎం విదేశీ పర్యటనతో ఆయన తుది ఆమోదం వరకు వేచి చూసారు. సీఎం ను కలిసిన అధికారులు ఫలితాల విడుదల పైన చర్చించారు. ఈ నెల 30న మల్లు భట్టి ఫలితాల విడుదల చేసేందుకు ముహూర్తం ఖరారు చేసారు.

మెమోల్లో మార్కులు
ఈ సారి పదో తరగతి మార్కుల మెమో విధానంలో ప్రభుత్వం మార్పులు చేసింది. పరీక్ష ఫలితాలు వెలువడుతున్న సమయంలో విద్యా శాఖ కార్యదర్శి యోగితా రాణి ఈ మార్పులకు సంబంధించి స్పష్టత ఇచ్చారు. ఇప్పటి వరకు గ్రేడింగ్ విధానంలో మెమోలు ఇచ్చే వారు. ఇక నుంచి ప్రతీ సబ్జెక్టులో గ్రేడింగ్ తో పాటుగా విద్యార్థి మార్కులు మెమోలో పొందు పేర్చనున్నారు. ఇంటర్నర్, ఎక్స్ టర్నర్ మార్కులు జీపీఏ మెమోలో ఉండేలా నిర్ణయించారు. ఇప్పటి వరకు విద్యార్థి ఆయా సబ్జెక్టుల్లో సాధించిన మార్కుల ఆధారంగా గ్రేడ్ లు ఇచ్చారు. దీని వలన ఎక్కువ మార్కులు పొందిన విద్యార్థి ఎవరనే విషయం గుర్తించటం కష్టం. ఇప్పుడు ఈ విధానం మార్పు చేయటంతో గ్రేడ్స్ తో పాటుగా సబ్జెక్టుల్లో ఎన్ని మార్కులు పొందారో మెమోలో ఉంటుంది.
ఫలితాల కోసం
ప్రస్తుతం వార్షిక పరీక్ష ప్రతీ సబ్జెక్టుకు 80 మార్కులకు ఉంటుంది. మిగిలిన 20 అంతర్గత మార్కు లుగా ఇస్తున్నారు. వచ్చే ఏడాది నుంచి అంతర్గత మార్కులను ఎత్తి వేయాలని విద్యా శాఖ నిర్ణయం తీసుకుంది. ఇక.. ఫలితాలను తర్వాత అధికారిక వెబ్‌సైట్ bse.telangana.gov.in లేదా results.bse.telangana.gov.in లో మార్కుల వివరాలు తెలుసుకోవచ్చు. విద్యార్ధులు తమ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేస్తే.. ఫలితాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. అలాగే SMS ద్వారా కూడా ఫలితాలు తెలుసుకోవచ్చు. దీని కోసం TS10ROLL NUMBER అని టైప్ చేసి 56263కు మెసేజ్ పంపిస్తే వెంటనే ఫలితాలు SMS ద్వారా క్షణాల్లో వస్తాయి. దీంతో, ఫలితాల ముహూర్తం ఖరారు కావటంతో విద్యార్ధుల్లో ఉత్కంఠ పెరుగుతోంది.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications