ఆపరేషన్ గులాబీ - మరో నలుగురు సిద్దం..!!
తెలంగాణ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో వ్యవహరించిన విధంగానే ఇప్పుడు ఆ పార్టీకి రివర్స్ షాక్ ఇచ్చేందుకు రేవంత్ సిద్దమయ్యారు. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకొనే ప్రక్రియ ముమ్మరం చేసారు. ఇప్పటికే పది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరారు. మరో 16 మంది చేరితే బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్ లో విలీనం అవుతుంది. ఇటు మరో నలుగురు పార్టీ మారేందుకు సిద్దమయ్యారు.
చేరికలు
కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ మరోసారి వేగవంతం చేసింది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉండటంతో ఈ లోగానే పార్టీలోకి వచ్చే ఎమ్మెల్యేలను చేర్చుకోవాలని భావిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల నాటికి బీఆర్ఎస్ ను బలహీన పర్చాలనే లక్ష్యంతో అడుగులు వేస్తోంది. రాజకీయంగా కాంగ్రెస్ ను పలు అంశాల్లో ప్రతిపక్ష బీఆర్ఎస్ టార్గెట్ చేస్తోంది. ఆ పార్టీకి ఆత్మరక్షణలోకి నెట్టేందుకు కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ ను అస్త్రంగా మార్చుకుంటోంది. తాజాగా మరో నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తో టచ్ లోకి వచ్చినట్లు సమాచారం.

మరో నలుగురు
ఈ నలుగురితో పాటుగా మరి కొందరితో కాంగ్రెస్ నేతలు టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. వీరితో చర్చలు పూర్తయిన తరువాత ఒకేసారి అందిరికీ పార్టీ కండువా కప్పాలనేది కాంగ్రెస్ వ్యూహ్యంగా కనిపిస్తోంది. తాజాగా బీఆర్ఎస్ వీడే వారిలో జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు, ఆలంపూర్ ఎమ్మెల్యే విజేయుడు, బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తో పాటు గ్రేటర్ హైదరాబాద్ కు చెందిన మరో ఎమ్మెల్యే పేరు కాంగ్ెస్ వర్గాల్లో ప్రచారంలో ఉంది. అయితే, గ్రేటర్ ఎమ్మెల్యే విషయంలో మాత్రం ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఆయన పైన పలు ఆరోపణలు ఉండటంతో నిర్ణయం పెండింగ్ లో ఉంచారు.
బీఆర్ఎస్ అలర్ట్
ఇటు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పైన వేటు కోసం బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తోంది. న్యాయ పోరాటం కొనసాగిస్తోంది. దీంతో..ఇప్పుడు పార్టీ మారాలనే ఆలోచనలో ఉన్న ఎమ్మెల్యేలను ఈ అంశం టెన్షన్ పెడుతోంది. అదే సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పై పోటీ చేసి ఓడిన నేతలు ఆ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి రావటాన్ని అంగీకరిచంటం లేదు. జీవన్ రెడ్డి ఎపిసోడ్ తరువాత పార్టీ నేతలను బుజ్జగించిన తరువాతనే ఎమ్మెల్యేలను చేర్చుకోవాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. దీంతో, రానున్న రోజుల్లో చేరికల అంశంలో కీలక పరిణామాలు చోటు చేసుకొనే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications