జైలుపాలు చేసిన రేవంత్ రెడ్డి పేరు జన్మలో మర్చిపోలేని అల్లు అర్జున్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పాన్ ఇండియా సినిమా పుష్ప 2 ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తున్నవేళ ఊహించని విధంగా అల్లు అర్జున్ జైలు పాలయ్యాడు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందడంతో నమోదైన పోలీస్ కేసులో అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టుకు తరలించగా కోర్టు అల్లు అర్జున్ కు 14రోజుల రిమాండ్ విధించింది.
ఆ సంఘటనే అల్లు అర్జున్ కొంప ముంచిందా?
అయితే ఊహించని విధంగా అల్లు అర్జున్ ను తెలంగాణ ప్రభుత్వం అరెస్టు చేయడం వెనుక ఇటీవల జరిగిన ఒక సంఘటన కూడా కారణం అయ్యుంటుందని సోషల్ మీడియాలోనూ, బయట ప్రజల్లోనూ ఆసక్తికర చర్చ జరుగుతుంది. అసలు ఇంతకీ ఏం జరిగింది అంటే పుష్ప 2 చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేసిన సమయంలో అల్లు అర్జున్ ఆ సినిమా సక్సెస్ కోసం పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.

సీఎం పేరు మర్చిపోయిన అల్లు అర్జున్
పుష్ప 2 సినిమా కోసం రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు టికెట్ల విషయంలో అనుమతిని ఇచ్చారని పేర్కొన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు తో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు తెలిపారు. అయితే తెలంగాణ ప్రభుత్వానికి అల్లు అర్జున్ థ్యాంక్స్ చెబుతున్న సమయంలో ఆయనకు సీఎం రేవంత్ రెడ్డి పేరు గుర్తుకు రాలేదు.
ముఖ్యమంత్రి పేరు మర్చిపోవటంపై సోషల్ మీడియాలో కామెంట్స్
దీంతో కాస్త గ్యాప్ తీసుకొని దానిని కవర్ చేస్తూ మంచినీళ్లు తాగడానికి కొంత సమయం తీసుకున్న తర్వాత రేవంత్ రెడ్డికి థాంక్స్ చెప్పారు ఇక సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డి పేరు అల్లు అర్జున్ మర్చిపోయారని ముఖ్యమంత్రి పేరు అల్లు అర్జున్ కు గుర్తుకు లేదని పలువురు వ్యాఖ్యలు చేశారు.
అవమానకర అరెస్ట్ వెనుక అల్లు అర్జున్ చేసిన అవమానం
ఇక ఇప్పుడు తాజా పరిణామంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరును ఇక పైన అల్లు అర్జున్ జీవితాంతం మర్చిపోడని, నిద్రలో కూడా రేవంత్ రెడ్డి పేరు గుర్తొస్తుందని పలువురు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరును మరిచిపోయి నిర్లక్ష్యంగా వ్యవహరించిన క్రమంలోనే ఈ తరహాలో ఇంత అవమాన రీతిలో అల్లు అర్జున్ ను అరెస్టు చేసినట్టుగా పలువురు అభిప్రాయపడుతున్నారు.
చట్టం తన పని తాను చేసుకు పోతుందన్న రేవంత్ రెడ్డి
ఏది ఏమైనాపటికి అల్లు అర్జున్ తన జీవితకాలం ఇకపై రేవంత్ రెడ్డి ని మర్చిపోడని తాజా పరిణామంతో స్పష్టమైంది. అసలు ఊహించని విధంగా అల్లు అర్జున్ జైలు పాలు కావడంతో రేవంత్ రెడ్డి సర్కార్ షాకింగ్ నిర్ణయాలపై ప్రస్తుతం ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ అరెస్టు పైన స్పందించిన రేవంత్ రెడ్డి చట్టం తన పని తాను చేసుకు పోతుందని, ఇందులో తన జోక్యం ఏమీ ఉండదని చెప్పారు. చట్టం ముందు అందరూ సమానమేనని తొక్కిసలాటలో ఒకరు చనిపోయారు కాబట్టే పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.












Click it and Unblock the Notifications