అల్లు అర్జున్ ఇమేజ్ డ్యామేజ్.. సీఎం రేవంత్ వ్యాఖ్యల అంతర్యం అదేనా!
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తాజాగా అసెంబ్లీలో అల్లు అర్జున్ పై చేసిన వ్యాఖ్యలతో తెలుగు రాష్ట్రాలలో దుమారం రేగింది. అల్లు అర్జున్ ను అరెస్టు చేసిన సందర్భంగా అల్లు అర్జున్ పైన వ్యక్తమైన సానుభూతి సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో తుడిచిపెట్టుకుపోయింది. సినీ, రాజకీయ వర్గాలలోనే కాదు సామాన్య ప్రజలలోనూ చర్చనీయాంశంగా మారింది.
అల్లు అర్జున్ పై జోరుగా సాగుతున్న చర్చ
సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి సంచలన విషయాలు చెప్పిన రేవంత్ రెడ్డి రేవతి అనే మహిళ చనిపోయిందని ఆమె కుమారుడు తీవ్ర గాయాల పాలై చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు అని చెప్పిన తర్వాత కూడా అల్లు అర్జున్ రోడ్ షో చేసిన తీరు తీవ్ర ఆక్షేపనీయమని అసెంబ్లీ వేదికగా చెప్పి అల్లు అర్జున్ పైన చర్చకు కారణమయ్యారు.

సీఎం వ్యాఖ్యల వెనుక మతలబు ఇదేనా
అయితే ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల పైన సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతుంది. రేపో మాపో అల్లు అర్జున్ బెయిల్ రద్దు అవుతుందని, బన్నీని మళ్లీ అరెస్టు చేసే అవకాశం ఉంద,ని ఈసారి కూడా ఆయనను రిమాండ్ కు తరలించొచ్చని అటువంటి సమయంలో ఎవరు అల్లు అర్జున్ పైన సానుభూతిని చూపించకుండా ఉండేందుకు రేవంత్ సర్కార్ గట్టిగానే ప్లాన్ చేస్తుంది అన్న టాక్ కూడా వినిపిస్తుంది.
అల్లు అర్జున్ కు మైనస్ గా సీఎం రేవంత్ వ్యాఖ్యలు
ఒక మహిళ చనిపోయిందని తెలిసిన తర్వాత కూడా అల్లు అర్జున్ మొత్తం సినిమా చూసి వెళ్ళాడని, చనిపోతే సినిమా హిట్ అవుతుందని నవ్వుతూ చెప్పాడని అల్లు అర్జున్ వ్యక్తిత్వాన్ని అసెంబ్లీ వేదికగా బట్టబయలు చేశారు. థియేటర్ కు రావద్దని పోలీసులు చెప్పినా వినకుండా వచ్చాడని, పూర్తిగా అల్లు అర్జున్ నిర్లక్ష్యం వల్లే నిండుప్రాణం పోయిందని సీఎం రేవంత్ వెల్లడించిన విషయం అల్లు అర్జున్ కు పెద్ద మైనస్ అయి కూర్చుంది.
అల్లు అర్జున్ పై సింపతీ వర్కవుట్ కాకుండా ప్లాన్?
ఇక ఈ క్రమంలో మళ్లీ అల్లు అర్జున్ ను అరెస్టు చేసినా ఎవరి నుండి ఆయనకు సింపతి వర్కౌట్ కాకూడదన్న ఉద్దేశం ప్రభుత్వానికి ఉందన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ అరెస్టు కు సంబంధించి, సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన ఘటన తాలూకా పూర్తి వివరాలను సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా వెల్లడించి సినీ లోకానికి ఒక సీరియస్ హెచ్చరికను జారీ చేశారు. మొత్తంగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో అల్లు అర్జున్ వ్యక్తిత్వం పైన జరుగుతున్న చర్చ చివరికి ఏ రూపు దాలుస్తుంది అన్నది వేచి చూడాల్సిందే.












Click it and Unblock the Notifications