Allu Arjun: ఫ్యాన్స్ కు అల్లు అర్జున్ స్వీట్ వార్నింగ్-సంచలన ట్వీట్..!
హైదరాబాద్ సంథ్య థియేటర్ ఘటన నేపథ్యంలో హీరో అల్లు అర్జున్ తీరుపై తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ గా ఉంది. ఈ సినిమా విడుదల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె కుమారుడు ఆస్పత్రి పాలైన ఘటనలపై అప్రమత్తమైన ప్రభుత్వం.. ఈ ఘటనపై కేసులు నమోదు చేసి హీరో అల్లు అర్జున్ ను సైతం జైలుకు పంపింది. ఆ తర్వాత బెయిల్ పై విడుదలైనా..అల్లు అర్జున్ పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అవుతూనే ఉన్నారు. దీనిపై నిన్న అల్లు అర్జున్ వివరణ కూడా ఇచ్చారు.
అయినా అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియాలో ప్రభుత్వం తీరుపై తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఫేక్ ఐడీలతో ప్రభుత్వాన్ని, సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు. దీనిపై ఇవాళ అల్లు అర్జున్ స్పందించారు. ఈ మేరకు ఎక్స్ లో ఆయన ఓ పోస్టు పెట్టారు. ఇందులో అభిమానులకు అల్లు అర్జున్ ఓ కీలక సూచన చేశారు. ఆన్‌లైన్‌లో మరియు ఆఫ్‌లైన్‌లో ఎలాంటి దుర్వినియోగ భాష లేదా ప్రవర్తనను ఆశ్రయించవద్దని, ఎప్పటిలాగే బాధ్యతాయుతంగా తమ భావాలను వ్యక్తపరచాలని నా అభిమానులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను అంటూ అల్లు అర్జున్ తెలిపారు.

I appeal to all my fans to express their feelings responsibly, as always and not resort to any kind of abusive language or behavior both online and offline. #TeamAA pic.twitter.com/qIocw4uCfk
— Allu Arjun (@alluarjun) December 22, 2024
అభిమానులు తమ అభిప్రాయాలను బాధ్యతాయుతంగా వ్యక్తపరచాలని అల్లు అర్జున్ కోరారు. ఎవరినీ వ్యక్తిగతంగా కించపరిచేలా పోస్టులు పెట్టవద్దని సూచించారు. ఫ్యాన్స్ ముసుగులో ఫేక్ ఐడీ, ఫేక్ ప్రొఫైల్స్‌తో పోస్టులు చేస్తున్నవారిపై చర్యలు తీసుకోబడతాయని అల్లు అర్జున్ హెచ్చరించారు. నెగెటివ్ పోస్టులు చేస్తున్నవారికి అభిమానులు దూరంగా ఉండాలని మరో సూచన కూడా చేశారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి తనపై చేస్తున్న వ్యాఖ్యలతో ఫ్యాన్స్ కూడా హర్ట్ అయి కౌంటర్లు వేస్తుండటంతో ఈ వ్యవహారం మరో లెవెల్ కు వెళ్లకముందే అల్లు అర్జున్ ఇలా స్పందించినట్లు తెలుస్తోంది.
-
ఆ స్టార్ హీరో నా క్లాస్ మెట్.. అన్నం పెట్టిన రోజుల్ని మర్చిపోలేను -
మళ్లీ వాయిదా.. "పెద్ది" మూవీ మరో 'హరిహర వీరమల్లు' కానుందా ??? -
పెళ్లిపై హీరో రామ్ కీలక ప్రకటన..!! -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఆర్భాటంగా పెళ్లి ప్రకటన చేసిన స్టార్ హీరోయిన్.. తీరా చూస్తే షాకింగ్ ట్విస్ట్! -
మౌళి "దొంగనా కొడుకు".. మైత్రీ మూవీస్ సంచలన ప్రకటన..!! -
పవర్ స్టార్ "OG" సీక్వెల్ షూటింగ్ షురూ.. టైటిల్ ఇదే ?? -
ప్రభాస్ రోజూ తినే ఫుడ్ ఖర్చు ఎంతో తెలుసా ? అన్నీ వెరైటీలా ?? -
ఎన్టీఆర్ మూవీలో రామ్ చరణ్ హీరోయిన్.. నీల్ ప్లాన్ గట్టిగానే !! -
పాన్ ఇండియా సినిమాలో బోల్డ్ సీన్.. చేయనని మొండికేస్తున్న స్టార్ హీరోయిన్! -
అలా అమరావతిలో.. కొత్త సినిమా కోసం పవన్ కళ్యాణ్ నయా ప్లాన్ !! -
‘బాహుబలి2’ను దాటలేకపోయిన ‘ధురంధర్2’












Click it and Unblock the Notifications