లక్షమందితో అమిత్ షా మెగా పాదయాత్ర... బీజేపీకి హైప్ ఇస్తుందా?

తెలంగాణా రాజకీయాల్లో మళ్లీ పొలిటికల్ హీట్ మొదలైంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం హైదరాబాద్‌లో చేపట్టనున్న మహా పాదయాత్రకు బీజేపీ భారీ సన్నాహాలు చేస్తోంది. 'లోక్‌తంత్ర బచావో - అరాచకత్వ హటావో' అనే నినాదంతో ఈ పాదయాత్ర నిర్వహించనున్నారు. ఢిల్లీ రాంలీలా మైదానంలో కాంగ్రెస్ నిర్వహించిన 'ఓట్ బచావో-దేశ్ బచావో' ర్యాలీకి కౌంటర్‌గా ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారు. అయితే లక్ష మంది జనంతో చేసే ఈ పాదయాత్ర బీజేపీకి హైప్ ఇస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది.

సాయంత్రం నాలుగు గంటలకు బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం దగ్గర నుంచి మొజంజాహీ మార్కెట్ వరకు అమిత్ షా పాదయాత్ర సాగనుంది. అక్కడ బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమానికి లక్ష మంది ప్రజలను సమీకరించాలని రాష్ట్ర బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కనీసం 20 వేల మందిని తీసుకురావాలని నాయకత్వం ఆదేశాలు జారీ చేసింది. ఒకపక్క త్వరలో ఎన్నికలు రానున్న క్రమంలో ఈ పాదయాత్రకు ప్రాధాన్యత చోటు చేసుకుంది.

Amit Shah Hyderabad padayatra Political Heat in Telangana as BJP Mobilizes 1 Lakh for Amit Shah Padayatra

కార్యకర్తలతో పాటు మేధావులు, వైద్యులు, న్యాయవాదులు, యువతను కూడా ఈ పాదయాత్రలో భాగస్వామ్యం చేయాలని బీజేపీ ప్రయత్నిస్తోంది.కేంద్ర మంత్రులు జి. కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ పాదయాత్ర బాధ్యతలలో ఉన్నారు. ఎన్నికల కమిషన్ చేపడుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై కాంగ్రెస్ చేస్తున్న ప్రచారాన్ని తప్పుడు నివేదికగా బీజేపీ అభివర్ణిస్తోంది. ప్రజాస్వామ్య సంస్థలపై దాడి చేస్తున్నారని, అరాచకత్వాన్ని ప్రోత్సహిస్తున్నారని ఆరోపిస్తూ ఈ పాదయాత్రను చేపట్టింది.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను కూడా అమిత్ షా ఎండగట్టే అవకాశం ఉంది. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, ప్రభుత్వ వైఫల్యాలను టార్గెట్ చేయటం, రాష్ట్రంలో పాలనపై అసంతృప్తి నెలకొని ఉండటంతో బీజేపీ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చూస్తోంది. పాదయాత్ర మార్గంలో భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. బీజేఆర్ విగ్రహం నుంచి ఎంజే మార్కెట్ వరకు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ట్రాఫిక్ నియంత్రణలు ఉంటాయని పోలీసులు తెలిపారు.

మోదీ గద్దె దిగక తప్పదు: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ ర్యాలీలో ఘాటువ్యాఖ్యలు!
మోదీ గద్దె దిగక తప్పదు: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ ర్యాలీలో ఘాటువ్యాఖ్యలు!

ఈ పాదయాత్ర తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారి తీస్తుందా, కాంగ్రెస్‌కు ఎలాంటి సవాల్ విసురుతుందన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. భవిష్యత్ గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీకి ఇది కొత్త ఉత్సాహం ఇస్తుందా? బీజేపీ ఆశిస్తున్న హైప్ వస్తుందా అన్నది తెలియాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+