హైదరాబాద్ లో అమిత్ షా పాదయాత్ర, అసలు టార్గెట్- కీలక మలుపు...!!
హైదరాబాద్ కేంద్రంగా బీజేపీ కొత్త రాజకీయం మొదలు పెట్టింది. జాతీయ స్థాయిలో మారుతున్న రాజకీయ సమీకరణాలకు హైదరాబాద్ కేంద్రంగా కౌంటర్ చేసేందుకు సిద్దం అవుతోంది. బీజేపీ ఈ సారి దక్షిణాది రాష్ట్రాల పైన ప్రత్యేకంగా ఫోకస్ చేస్తోంది. అందులో భాగంగా తెలంగాణలో కొత్త ఆపరేషన్ ప్రారంభించింది. ఇప్పుడు కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్ లో మహా పాద యాత్రకు సిద్దమయ్యారు. ఈ నిర్ణయం వెనుక అసలు టార్గెట్ ఏంటనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది. పాదయాత్ర వేళ కొత్త రాజకీయం తెర మీదకు వస్తోంది.
తెలంగాణ కేంద్రంగా బీజేపీ వ్యూహం మార్చింది. కాంగ్రెస్ ను కౌంటర్ చేసేందుకు తెలంగాణ నుంచే సమరం మొదలు పెట్టింది. తాజాగా కాంగ్రెస్ మిత్ర పక్షాలతో కలిసి ఢిల్లీ భారీ మార్చ్ నిర్వహించారు. దేశ వ్యాప్తంగా భారీ సంఖ్య లో కాంగ్రెస్ శ్రేణులు ఢిల్లీకి వచ్చారు. దీంతో.. ఇప్పుడు బీజేపీ వీరిని రివర్స్ ఎటాక్ చేయాలని భావిస్తోంది. ఇందు కోసం కొత్త కార్యాచరణ డిసైడ్ చేసింది. ఈ క్రమంలోనే హైదరాబాద్ లో ఈ రోజు మహాపాదయాత్ర డిసైడ్ చేసింది. ఇందులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా పాల్గొంటున్నారు. సోమవారం మధ్యాహ్నం 3:00 గంటలకు బషీర్బాగ్లోని నిజాం కాలేజ్ ఎదురుగా ఉన్న డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద అమిత్ షా పాదయాత్ర ప్రారంభం కానుంది. అక్కడి నుంచి అబిడ్స్ మీదుగా సాగి, సాయంత్రం 6:00 గంటలకు ఎంజే మార్కెట్ వద్ద ముగుస్తుంది.

బీజేపీ కొత్త వ్యూహాలతో.. టార్గెట్ 2028
ఈ పాదయాత్రలో అమిత్ షాతో పాటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు, రాష్ట్ర ఇన్చార్జ్ సునీల్ బన్సల్, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పెద్ద ఎత్తున పాల్గొననున్నారు. పార్టీ శ్రేణులతో మాత్రమే కాకుండా.. తటస్థులు... వివిధ వర్గాలకు చెందిన నిపుణులు, వైద్యులు, న్యాయవాదులు, మేధావులు ఈ యాత్రలో పెద్ద ఎత్తున భాగస్వాములయ్యేలా బీజేపీ వ్యూహరచన చేసింది. కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న విధానాలపై, ముఖ్యంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఓటర్ జాబితాల అంశంపై కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడమే ప్రధాన లక్ష్యంగా ఈ మహా పాదయాత్రను చేపడుతున్నట్టు పార్టీ నేతలు వెల్లడించారు. ఈ పాదయాత్ర వేళ అమిత్ షా పార్టీ నేతలకు కీలక దిశా నిర్దేశం చేయనున్నారు.













Click it and Unblock the Notifications
