జాతీయ జెండాను అవమానించిన అమిత్ షా కొడుకు జై షా.. ఎమ్మెల్యే సీతక్క ఫైర్!!
ఆసియా కప్ 2022లో టీమిండియా విజయం సాధించి శుభారంభం చేసిన విషయం తెలిసిందే. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో భారతదేశం దాయాది దేశమైన పాకిస్థాన్ పై విజయం సాధించడంతో దేశ వ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ఇక ఇదే సమయంలో ఈ మ్యాచ్ కు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కొడుకు, బీసీసీఐ సెక్రటరీ జై షా కూడా హాజరయ్యారు. టీమిండియా విజయం సాధించిన తర్వాత ఆయన చేసిన ఒక పని ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది.
ఆసియా కప్ 2022లో ఇండియా టీం విజయం సాధించిన తర్వాత, మ్యాచ్ అనంతరం లేచి చప్పట్లు కొడుతున్న జై షాకు ఆయన పక్కనే ఉన్న ఓ వ్యక్తి జాతీయ జెండాను పట్టుకోమని ఇచ్చే ప్రయత్నం చేశారు. దానికి జై షా వద్దు అంటూ నిరాకరించారు. దీంతో ఇప్పుడు ఈ సంఘటన వివాదంగా మారింది. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీ నేతలు ఈ వ్యవహారంపై మండిపడుతున్నారు. అమిత్ షా దేశభక్తి అంటుంటే, జై షా మాత్రం జాతీయ జెండానే పట్టుకోవడం లేదంటూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.

తాజాగా ములుగు ఎమ్మెల్యే సీతక్క నిన్న జరిగిన ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ సందర్భంగా కేంద్ర మంత్రి అమిత్ షా కుమారుడు జై షా వ్యవహారంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ హైలైట్స్ అంటూ పేర్కొన్న ఎమ్మెల్యే సీతక్క అమిత్ షా కుమారుడు జై షా భారతదేశ జాతీయ జెండాను తిరస్కరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. త్రివర్ణ పతాకంతో ఎందుకు అమిత్ షా కొడుకు జై షా ఇండియా విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవాలని అనుకోవడం లేదో చెప్పాలని ఎమ్మెల్యే సీతక్క ప్రశ్నించారు. భారతదేశ జాతీయ జెండా అంటే ఆయనకి ఏమైనా ఎలర్జీ ఉందా? అంటూ ఎమ్మెల్యే సీతక్క నిప్పులు చెరిగారు.
India Vs Pakistan Match highlights !!
— Danasari Anasuya (Seethakka) (@seethakkaMLA) August 28, 2022
🔥 Amith shah son Jay Shah just rejected India flag…
🔥Why Amit Shah's son Jay Shah doesn't want to celebrate India's win with the tricolour.
Is he allergic towards Indian Flag?#IndiaVsPakistan #jayshah pic.twitter.com/I5ZrWGgtqp
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications