హైదరాబాద్‌ను హడలెత్తిస్తున్న ఆమ్రపాలి!!
జిహెచ్ఎంసి కమిషనర్ గా ఆమ్రపాలి కాట బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. జిహెచ్ఎంసి సిబ్బందిని ఆకస్మిక తనిఖీలతో హడలెత్తిస్తున్నారు. పారిశుద్ధ్యం విషయంలో స్పెషల్ ఫోకస్ చేస్తున్న ఆమ్రపాలి కాట ఆకస్మిక పర్యటనలతో పారిశుద్ధ్య సిబ్బందికి చుక్కలు చూపిస్తున్నారు. ఎవరికీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా క్షేత్ర స్థాయి తనిఖీలను చేస్తూ షాక్ కు గురి చేస్తున్నారు.
క్షేత్ర స్థాయి పర్యటనలతో హడలెత్తిస్తున్న జీహెచ్ఎంసీ కమీషనర్
గ్రేటర్ హైదరాబాద్లో వర్షాకాలం వచ్చిందంటే పారిశుధ్యం పెద్ద సమస్య. నగరంలో చెత్త తొలగింపు ఒక పెద్ద టాస్క్. వర్షాకాలంలో వరద ముంపు, వర్షం పడితే చాలు పొంగి పొర్లే డ్రైనేజ్ లు, మ్యాన్ హోల్స్ ఇలా ఈ సీజన్ లో నగరంలో అన్నీ ప్రధాన సమస్యలే. చినుకు పడితే చిత్తడిగా మారే నగరంలో చోటుచేసుకునే ఇబ్బందులు పరిష్కరించడం పైన ఫోకస్ చేస్తున్న ఆమ్రపాలి తరచూ క్షేత్రస్థాయి పర్యటనలతో హడావిడి చేస్తున్నారు.

దోమల నివారణకు ఆదేశాలు
తాజాగా నగరంలో దోమలు ఉత్పత్తి అయ్యే హాట్ స్పాట్లను గుర్తించి, దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని ఆమ్రపాలి కాటా అధికారులను ఆదేశించారు . గ్రేటర్ హైదరాబాద్లో డెంగ్యూ వ్యాధి నివారణలో భాగంగా స్కూల్స్, కాలేజీలలో చేపట్టే అవగాహన కార్యక్రమాలను వెంటనే పూర్తి చేయాలన్నారు. పారిశుధ్యం పైన, దోమల హాట్ స్పాట్ లపై దృష్టి సారించాలని పేర్కొన్నారు.
స్వచ్చ ఆటోల పని తీరుపై ఆమ్రపాలి నిర్ణయాలు
ముఖ్యంగా బస్తీలు భవన నిర్మాణ స్థలాల వద్ద పనిచేసే కార్మికులు నివసించే చోట, వసతి గృహాలలో ఖాళీ స్థలాలను దోమల నివారణకు చర్యలు చేపట్టాలన్నారు. ఇదే సమయంలో స్వచ్ఛ ఆటో డ్రైవర్ నిర్దేశించిన ప్రకారం చెత్త సేకరణ చేస్తూ, డైలీ హాజరు ఉన్న వారిని సర్కిల్,జోన్ వారీగా గుర్తించి అవార్డులు ప్రధానం చేయాలని శానిటేషన్ అడిషనల్ కమిషనర్ ను ఆమ్రపాలి కాటా ఆదేశించారు.
సిబ్బందిని పరుగులు పెట్టిస్తున్న యంగ్ ఐఏఎస్
స్వచ్ఛ ఆటో హాజరు పరిస్థితి సరిగ్గా లేకుంటే వారిపై చర్యలు తీసుకోవాలని ఆమ్రపాలి కాటా ఆదేశించారు. స్వచ్ఛ ఆటోలలో చెత్త వెయ్యని వాళ్లను గుర్తించి వారికి అవగాహన కల్పించాలన్నారు. ప్రధానంగా స్వచ్ఛ నగరంగా గ్రేటర్ హైదరాబాద్ ను తీర్చ దిద్దటమే ధ్యేయంగా ఆమ్రపాలి కాటా తన మార్క్ చూపిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పైన ప్రధానంగా దృష్టి సారించి విధి నిర్వహణలో సిబ్బందిని పరుగులు పెట్టిస్తున్న యంగ్ డైనమిక్ ఐఏఎస్ ఆఫీసర్ ఆమ్రపాలి కాటా తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications