SBI: ఖాతాదారుడి రూ.14 లక్షలు నొక్కేసిన బ్యాంకు ఉద్యోగి..
ఖాతాదారుడి డబ్బును తన ఖాతాలోకి మళ్లించుకున్నాడు ఓ బ్యాంకు ఉద్యోగి. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో జరిగింది. డబ్బు కోసం బాధితుడు బ్యాంకుకు రాగ అస్సలు విషయం బయటపడింది. నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం తాడురు చెందిన వినోద్ కుమార్ కు అచ్చంపేటలోని ఎస్బీఐ బ్యాంకులో అకౌంట్ ఉంది. కొద్ది నెలల క్రితం అతను తన రూ.14.73 వేలు జమ చేశాడు. ఈ మధ్య అతని డబ్బు అవసరం వచ్చింది. దీంతో అతను సెప్టెంబర్ 29న బ్యాంకుకు వెళ్లాడు.
రూ.లక్ష కోసం విత్ డ్రా ఫామ్ పూర్తి చేసి క్యాషియర్ కు అందించాడు. ఖాతాను చెక్ చేసిన క్యాషియర్ అందులో డబ్బు లేదని చెప్పాడు. దీంతో షాకైన వినోద్ కుమార్ తన ఖాతాలో రూ.14 లక్షలకు పైగా డబ్బు ఉండాలని చెప్పాడు. దీంతో క్యాషియర్ ఈ విషయాన్ని బ్యాంకు మేనేజర్ దృష్టికి తీసుకెళ్లాడు. వినోద్ కుమార్ కూడా మేనేజర్ కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. మేనేజర్ బ్యాంకులో అతర్గంత విచారణ చేశారు. వినోద్ కుమార్ ఖాతా నుంచి సెప్టెంబర్ 5న రూ.6 లక్షలు, ఆ తర్వాత రూ.5 లక్షలు, 6 తేదీన రూ.3 లక్షలు బ్యాంకు ఉద్యోగి తన ఖాతాలోకి బదీలీ చేసుకున్నట్లు తేలింది.

ఈ విషయమై బ్యాంకు మేనేజర్ బాధితుడితో మాట్లాడాడు. ఈ విషయాన్ని బ్యాంకు పై అధికారులు దృష్టికి తీసుకెళ్తామని చెప్పాడు. అయితే ఇప్పటి వరకు కూడా తన ఖాతాలో నగదు జమ కాలేదని వినోదు కుమార్ వాపోయాడు. ఉప్పునుంతల సర్పంచ్ భర్త కృష్ణయ్య ఆధ్వర్యంలో మంగళవారం బాధిత కుటంబ సభ్యులు ఆందోళనకు దిగారు. సర్పంచ్ భర్త కృష్ణయ్య బ్యాంకు మేనేజర్ తో ఫోన్ లో మాట్లాడాడు. ఓ ఉద్యోగి తప్పు చేసిన నిజమేనని విచారణలో తేలిందని.. బాధితుడి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
దీంతో బాధితులు ఆందోళన విరమించారు. బ్యాంకు ఖాతా తీసుకున్నప్పుడు తప్పనిసరిగా మీ మీ ఫోన్ నంబర్ ఇవ్వాలి. మీకు ఎప్పటికప్పుడు మేసేజ్ వచ్చేలా చూసుకోవాలి. అంతే కాకుండా బ్యాంక్ యాప్ డౌన్ లోడ్ చేసుకుని మీ డబ్బును కనీసం వారాని ఒకసారి అయినా తనిఖీ చేసుకోవాలి. మినీ స్టేట్ మెంట్ చూస్తూ ఉండాలి. అందులో డబ్బు ఎవరికి ఏ తేదీనా పంపామో కనిపిస్తుంది. ఏదైనా ఫ్రాడ్ జరిగినట్లు గుర్తిస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలి. ఈ కేసులో ఆ ఉద్యోగిని ఇంకా అరెస్ట్ చేయాలేదంటే.. పలు అనుమానాలకు తావిస్తోంది.
-
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
మళ్ళీ లాక్డౌన్? కేంద్రం సంచలన ప్రకటన -
వచ్చే మూడు నెలలు హై అలర్ట్, ఏపీలో ఎండల ముప్పు











Click it and Unblock the Notifications