సీన్ రివర్స్..! : పార్టీ మారాలనుకున్న ఓ నేతకు ఊహించని ట్విస్ట్..
దామరచర్ల : ఓట్లేసి గెలిపించిన జనం.. వెనుకుండి నడిపించిన అనుచరులు.. వీళ్లందరిని కాదని పార్టీ ఫిరాయింపులకు పాల్పడితే.. చెల్లుబాటవుతుందా..! ఇదంతా పక్కనబెడితే అసలు జనం తిరగబడరా.. జవాబుదారీ తనం లేదు కాబట్టే నేతలు తమకు నచ్చిన పార్టీ కండువా కప్పేసుకుంటూ వెళ్తున్నారు. కానీ నల్గొండలో ఓ పార్టీ కార్యకర్త పార్టీ మారడానికి వెళ్తున్న తమ నాయకుడి పట్ల తిరగబడ్డాడు.
అయితే సదరు వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు పాల్పడడం గమనార్హం. వివరాల్లోకి వెళ్తే.. 'పార్టీ మారితే, మారితే చచ్చిపోతా..' అంటూ నల్గొండ జిల్లా దామరచర్లలో ఓ వ్యక్తి సెల్ టవర్ ఎక్కి హల్‌చల్ చేశాడు. స్థానికి జడ్పీటీసీ కేతావత్ శంకర్‌నాయక్ కాంగ్రెస్ ని వీడి టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారన్న వార్తల నేపథ్యంలో.. విషయం తెలుసుకొన్న మండలంలోని వాచ్యా తండాకు చెందిన కాంగ్రెస్ కార్యకర్త లావూరి మంగ్తా సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు దిగాడు.

శంకర్‌నాయక్ కాంగ్రెస్ ని వీడితే సెల్ టవర్ పైనుంచి కిందికి దూకి చనిపోతానని బెదిరించాడు. కాగా, దీనిపై సమాచారం అందుకున్న వాడపల్లి ఎస్‌ఐ వీరరాఘవులు అక్కడకు చేరుకొని మంగ్తాతో ఫోన్ లో మాట్లాడారు. పోలీసులతో ఫోన్ లో మాట్లాడిన మంగ్తా, శంకర్‌నాయక్ పార్టీ మారనని హామీ ఇస్తేనే కిందికి దిగుతానని తెగేసి చెప్పడంతో పోలీసులు శంకర్‌నాయక్‌తో ఫోన్‌లో మాట్లాడించారు.
చివరికి శంకర్‌నాయక్ మంగ్తాకు ఫోన్ లో నచ్చజెప్పటంతో దాదాపు అరగంట హైడ్రామా అతడు కిందికి దిగాడు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకొన్నారు. అనంతరం మంగ్తాను అరెస్ట్ చేసిన పోలీసులు ఆత్మహత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications