Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీ గెలుపు లాంఛనమే

తెలంగాణ రాష్ట్రంలో మరో ఎన్నికల నగరా మోగింది.హైదరాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎమ్మెల్సీ ఎం.ఎస్‌.ప్రభాకర్‌ పదవీ కాలం ఈ ఏడాది మే 1వ తేదీకి ముగియనుంది. దీంతో ఈ ఎమ్మెల్సీ పదవికి ఎన్నిక జరగనుంది.

హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పరిధిలో మొత్తం ఓట్లు 110 ఉన్నాయి. అందులో 81 మంది కార్పొరేటర్లు, 29 మంది ఎక్స్అఫీషియో సభ్యులు.. ఉండగా.. ప్రస్తుతం 3 డివిజన్లకు కార్పొరేటర్ల స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అయితే ఈ ఎమ్మెల్సీ ఎన్నిక ఏకపక్షంగానే జరిగే అవకాశాలు కనిపిస్తుంది. ఒక్కసారి ఆయా రాజకీయ పార్టీల రాజకీయ బలాలు గురించి చర్చించుకుంటే..

Analysis on the Hyderabad Local Bodies MLC Election

ఎంఐఎం
ఎంఐఎం పార్టీ బలం - 49 (1 ఎంపీ, 7 ఎమ్మెల్యేలు, 1 ఎమ్మెల్సీ, 40 మంది కార్పొరేటర్లు)

బీఆర్ఎస్
ఆర్ఎస్ పార్టీ బలం - 25 (3 రాజ్యసభ ఎంపీలు, 2 ఎమ్మె ల్సీలు, 5 ఎమ్మెల్యేలు, 15 మంది కార్పొరేటర్లు)

బీజేపీ
బీజేపీ పార్టీ బలం - 19 (1 ఎంపీ, 1 ఎమ్మెల్సీ, 19 మంది కార్పొరేటర్లు)

కాంగ్రెస్
కాంగ్రెస్ పార్టీ బలం - 14 (1 రాజ్యసభ ఎంపీ, 4 ఎమ్మె ల్సీలు, 2 ఎమ్మెల్యేలు, 7 కార్పొరేటర్లు)

ఎంఐఎం పార్టీ 49 ఓట్లతో బలంగా ఉండటం.. పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుండడంతో ఎంఐఎం పార్టీ విజయం దాదాపు ఖాయంగా కనిపిస్తుంది. దీంతో ఆ పార్టీ అభ్యర్థి విజయం సాధించడం పక్కగా మారింది. అయితే దీనిపై బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. బీఆర్ఎస్ ,కాంగ్రెస్ పార్టీలు ఎంఐఎం పార్టీతో లోపాయికారి ఒప్పందం చేసుకున్నారని అందుకే తమ పార్టీల అభ్యర్థులను బరిలో ఉంచడం లేదని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. సరైన సంఖ్య బలం లేని కారణంగానే పోటీ చేయడం లేదని ఆ రెండు పార్టీలు ప్రకటించాయి.నామినేషన్లు దాఖలుకు ఏప్రిల్ 4 చివరి తేదీగా నిర్ణయించారు. ఏప్రిల్ 23వ తేదీన పోలింగ్ జరుగనుంది. ఏప్రిల్ 25వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+