Betting Apps Case: తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన యాంకర్ శ్యామల
Betting Apps Case: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లకు సంబంధించి తనపై నమోదైన ఎఫ్ఐఆర్‍ను క్వాష్ చేయాలని కోరుతూ ప్రముఖ టెలివిజన్ యాంకర్, వైసీపీ నాయకురాలు శ్యామల తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేశారని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో యాంకర్ శ్యామలపై కేసు నమోదైన విషయం తెలిసిందే. హైకోర్టు నేడు ఆమె పిటిషన్ పై విచారణ జరపనుంది. గేమింగ్, ఐటీ చట్టాలను ఉల్లంఘించే బెట్టింగ్ యాప్ లను ప్రోత్సహించినందుకు పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసిన 11 మంది ప్రముఖులలో శ్యామల కూడా ఉన్నారు. Andhra365 అనే ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ కు శ్యామల ప్రమోషన్ చేసినట్లు తెలిసింది.
ఈ కేసులో ఉన్నవారి టీవీ యాంకర్ విష్ణుప్రియ, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ రీతూ చౌదరిలను గురువారం పంజాగుట్ట పోలీసులు సుదీర్ఘంగా విచారించిన సంగతి తెలిసిందే. భారతీయ న్యాయ సంహిత, తెలంగాణ రాష్ట్ర గేమింగ్ చట్టం, ఐటీ చట్టం కింద సెక్షన్లను ఉదహరించిన ఎఫ్ఐఆర్.. వినియోగదారులలో ఆర్థిక ఇబ్బందులకు దారితీసే జూదం కార్యకలాపాలను ఈ వ్యక్తులు ప్రోత్సహిస్తున్నారని ఆరోపించింది.బెట్టింగ్ యాప్ ప్రమోషన్లకు సంబంధించి మనీలాండరింగ్ కోణాలను అన్వేషిస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దర్యాప్తులోకి ప్రవేశించింది.

బెట్టింగ్ యాప్ లపై ఇటీవల పోలీసులు ప్రత్యేకంగా దృష్టిసారించారు. ఐపీఎస్ అధికారి, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ చేస్తున్న అవగాహన కార్యక్రమం వల్ల బెట్టింగ్ యాప్స్ లో ప్రమోషన్ చేసిన పలువురు ప్రముఖులు వెలుగులోకి వచ్చారు. ఈ క్రమంలో బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన యాంకర్లు, నటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లయెన్సర్లపై తెలంగాణ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ బెట్టింగ్ యాప్ ల వల్ల చాలా మంది అప్పుల ఊబిలో కూరుకుపోయారు. అప్పుల బాధ భరించలేక కొందరు ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications