హైదరాబాద్ నగరానికి ఏమైంది? మళ్ళీ మరో భారీ అగ్నిప్రమాదం!!

హైదరాబాద్ శాస్త్రీపురంలోని ఒక ప్లాస్టిక్ గోడౌన్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించడంతో ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు.

హైదరాబాద్లో వరుస అగ్ని ప్రమాదాలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇటీవల కాలంలో వరుసగా చోటు చేసుకున్న అగ్ని ప్రమాదాలతో భాగ్యనగర వాసులు బెంబేలెత్తిపోతున్నారు. సికింద్రాబాద్లోని స్వప్నలోక్ కాంప్లెక్స్ లో జరిగిన అగ్ని ప్రమాద ఘటన మరిచిపోక ముందే మళ్లీ హైదరాబాద్లో ఒక భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సికింద్రాబాద్ పరిధిలో స్వప్నలోక్ కాంప్లెక్స్ లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాద ఘటన ఆరుగురు యువత ఆశలను, వారిపై తల్లిదండ్రులు కన్న కలలను చిదిమేసింది.

అగ్ని ప్రమాదాలు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారాయి. ఎండాకాలం ప్రారంభంలోనే భారీగా అగ్నిప్రమాద ఘటనలు చోటు చేసుకోవడం ప్రతి ఒక్కరిని ఆలోచించేలా చేస్తుంది. అగ్ని ప్రమాదాల నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏమిటి అన్న ప్రశ్నను ప్రతి ఒక్కరిలో ఉత్పన్నమయ్యేలా చేస్తుంది. ఇక తాజాగా శాస్త్రీపురంలోని ఒక ప్లాస్టిక్ గోడౌన్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించడంతో మంటలు ఎగసిపడుతున్నాయి.

Another huge fire accident: What happened to the city of Hyderabad!!

కాలా పత్తర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఇక ఈ అగ్ని ప్రమాదానికి కూడా షార్ట్ సర్క్యూట్ కారణంగా తెలుస్తుంది. భారీగా ఎగసిపడుతున్న మంటలను అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బంది ఐదు ఫైరింజన్లతో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు తెల్లవారుజామున జరిగిన ఈ అగ్నిప్రమాదం ఒక స్క్రాప్ గోడౌన్లో జరిగినట్టుగా సమాచారం. అగ్నిప్రమాదం ధాటికి గోడౌన్ లో ఉన్న రెండు డీసీఎం వాహనాలు దగ్ధమయ్యాయి. అయితే ఈ ఘటనలో ఎవరికీ ప్రాణ నష్టం జరగలేదని సమాచారం.

Another huge fire accident: What happened to the city of Hyderabad!!

ప్రమాదం కారణంగా పరిసర ప్రాంతాలలో దట్టమైన పొగ అలుముకోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకోవడానికి ఉక్కిరిబికిరవుతున్నారు. ఇక ప్రమాదం జరిగిన ప్రాంతానికి పరిసర ప్రాంతాలలో అన్ని ప్లాస్టిక్ స్క్రాప్ గోడౌన్ లు ఉండడంతో వీటికి మంటలు అంటుకోకుండా అగ్నిమాపక సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎక్కువ మొత్తంలో స్క్రాప్ ఉండడంతో మంటలను అదుపు చేయడం అగ్నిమాపక సిబ్బందికి కష్టంగా మారింది. ఎండాకాలం ఇంకా తీవ్రం కాకముందే హైదరాబాద్ మహానగరంలో వరుసగా చోటు చేసుకుంటున్న అగ్ని ప్రమాదాలు అక్కడి ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+