వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరో మూడురోజులు వర్షాలు.. వాతావరణ శాఖ సూచన

|
Google Oneindia TeluguNews

తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 3 రోజులు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఉండనుందని, దీంతో వివిధ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

నైరుతి రుతుపవనాల రాకతో తెలుగు రాష్ట్రాల్లో కొద్ది రోజులుగా వానలు కురుస్తూనే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. బుధవారం రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 7 నుంచి 13 మిమి నమోదైంది. అత్యధికంగా పెద్దపల్లి జిల్లాలో నమోదైంది. ఆదిలాబాద్‌, కుమరంభీం ఆసిఫాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, మంచిర్యాల, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల్లో భారీగా వర్షపాతం నమోదైంది.

 another three days rain in telugu states

ఉక్కపోతతో అల్లాడిన జనం వర్షం కురిసి చల్లబడటంతో రిలాక్స్ అయ్యారు. ఇటు కరోనా కేసులు కూడా కాస్త తగ్గుముఖ పట్టాయి. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. థర్డ్‌వేవ్ పిల్లలకు అని ప్రచారం జరుగుతోంది. వచ్చే ఏడాది సమ్మర్‌లో ఫోర్త్ వేవ్ అని కూడా అంటున్నారు. దీంతో కరోనా 5,6 ఏళ్లు ఉంటుందని అర్థం చేసుకోవచ్చు. సరయిన వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేవరకు జనానికి ఇబ్బందులు తప్పవు. సో జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. తాజాగా గ్రీన్ ఫంగస్ వెలుగులోకి వచ్చింది.

వానకాలం రావడంతో ఫంగస్ ఇంపాక్ట్ తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు బ్లాక్ ఫంగస్ ఇంపాక్ట్ కనిపించింది.. కానీ అదీ కూడా తగ్గుముఖం పడుతుందని చెప్పడం కాస్త సానుకూల అంశం. మొత్తానికి కరోనాతో కలిసి బతకాల్సిందే.. అందుకోసం విధిగా మాస్క్ ధరించి.. శానిటైజర్ రాసుకుంటూ కాలం వెళ్లదీయాల్సిందే.

English summary
another three days rain in telugu states weather officials said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X