మరో రెండురోజులు వానలు.. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు
తెలంగాణ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఎక్కువయ్యాయి. అసలే కరోనా వైరస్.. అపై ఉక్క పోతతో జనం అల్లాడిపోతున్నారు. వైరస్ వల్ల జనం ఏసీలకు దూరంగా ఉంటున్నారు. కానీ వేడిమితో మాత్రం తట్టుకోలేకపోతున్నారు. నిన్న (శుక్రవారం) ఒక్కసారిగా పలుచోట్ల వర్షాలు కురిసాయి. అవీ మరో రెండురోజులు కంటిన్యూ అవుతాయని వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది.
తెలంగాణ రాష్ట్రంలో శని, ఆదివారం కూడా పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. తుఫాను ప్రభావం వల్ల రాష్ట్రంలో 15, 16వ తేదీల్లో వర్షం ఉండే అవకాశం ఉన్నట్లు తెలిపింది. దక్షిణ తెలంగాణ జిల్లాలపై ప్రభావం ఎక్కువగా వుండే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.

Recommended Video
రాష్ట్రంలో కరోనా కేసులు కూడా ఎక్కువ వస్తున్నాయి. గతేడాది కూడా సమ్మర్‌లోనే కేసులు పెరిగాయి. ఈ సారి కూడా అదే పరిస్థితి.. కాకపోతే కేసులతోపాటు మరణాలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. వాతావరణం చల్లబడటంతో వైరస్ కూడా తగ్గుముఖం పడుతుందోననే ఆశ ఏ మూలానో ఉంది. మరోవైపు బ్లాక్ ఫంగల్ కేసులు కూడా పెరుగుతున్నాయి. ఇదీ మరింత ఆందోళన కలిగించే అంశంగా మారింది.












Click it and Unblock the Notifications