Pawan Kalyan: కేసీఆర్‌కు పవన్ కల్యాణ్ బర్త్ డే విషెస్
Pawan Kalyan: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలను బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యలో పలువురు రాజకీయ ప్రముఖులు కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలను తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బర్త్ డే విషెస్ తెలిపారు. "తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి,బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు మరెన్నో సంవత్సరాల పాటు ప్రజలకు సేవ చేసేందుకు మంచి ఆరోగ్యం, ఆనందం, నిరంతర శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నాను." అంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎక్స్ వేదికా శుభాకాంక్షలు తెలియజేశారు.
Heartfelt birthday wishes to the former Chief Minister of Telangana and President of the @BRSparty, Sri Kalvakuntla Chandrashekar Rao (KCR) Garu. May you be blessed with good health, happiness, and continued strength to serve the people for many more years - @PawanKalyan@KTRBRS…
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) February 17, 2025
మాజీ సీఎం కేసీఆర్ కు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. "బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నాను" అంటూ బండి సంజయ్ ఎక్స్ వేదికగా బర్త్ డే విషెస్ తెలిపారు.

బిఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నాను.@KCRBRSPresident pic.twitter.com/IImbbhKOAi
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) February 17, 2025
వారితో పాటు కేసీఆర్ కు సీఎం రేవంత్ తో సహా పలువురు ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ మాజీ సీఎం జగన్ సైతం గ్రీటింగ్స్ చెప్పారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ ఇద్దరూ కేసీఆర్ తో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కేసీఆర్ జన్మదిన వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. పూజలతో పాటుగా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.












Click it and Unblock the Notifications