కెటిఆర్‌కు నారాలోకేష్ బర్త్‌డే గ్రీటింగ్స్, కలిసిపనిచేద్దామన్న కెటిఆర్
తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్‌కు ఏపీ ఐటీశాఖ మంత్రి నారాలోకేష్ సోమవారంనాడు శుభాకాంక్షలు తెలిపారు.అయితే దీనికి కెటిఆర్ స్పందించారు. రెండు రాష్ట్రాల అభివృద్దికి కలిసిపనిచేద్దామంటూ కెటిర్ ట్వీట్
హైదరాబాద్: తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్‌కు ఏపీ ఐటీశాఖ మంత్రి నారాలోకేష్ సోమవారంనాడు శుభాకాంక్షలు తెలిపారు. అయితే దీనికి కెటిఆర్ స్పందించారు. రెండు రాష్ట్రాల అభివృద్దికి కలిసిపనిచేద్దామంటూ కెటిర్ ట్వీట్ చేశారు.
కెటిఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు...ఆయన ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని కోరుకొంటున్నా అని ఆయన ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు కెటిఆర్ స్పందించారు. తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన లోకేష్‌కు ఆయన ట్విట్టర్‌లో ధన్యవాదాలు తెలిపారు. రెండు రాష్ట్రాల అభివృద్దికి కలిసి పనిచేద్దామని కెటిఆర్ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.

సమంత ప్రశంసలు
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కెటిఆర్‌పై సినీ నటి సమంత పొగడ్తలను కురిపించింది. ట్విట్టర్‌లో ఆమె మంత్రి కెటిఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అత్యంత ప్రియమైన నాయకుడికి శుభాకాంక్షలు. నిజమైన స్పూర్తి, నమ్మకం కలిగించే మీతో పరిచయం ఏర్పడడం గౌరవంగా భావిస్తున్నా సర్ అంటూ సమంత్ ట్వీట్ చేసింది.

సమంత ట్వీట్‌పై కెటిఆర్ స్పందించారు. మా చేనేత ప్రచారకర్తకు చాలా ధన్యవాదాలు. మీ ఫోకస్, అంకితభావంతో నూతనోత్తేజాన్ని తెచ్చారు. వొవెన్ 2017 కోసం ఎదరుచుస్తున్నా అని ఆయన రిప్లై ఇచ్చారు. అందుకు సమంత ధన్యావాదాలు తెలిపింది.












Click it and Unblock the Notifications