మహేష్ గౌడ్ కు రాహుల్ బిగ్ టాస్క్ - సమర్ధతకు పరీక్ష..!!

తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త అధ్యక్షుడు ఖరారయ్యారు. అనేక తర్జన భర్జనల తరువాత మహేష్ గౌడ్ కు పీసీసీ పగ్గాలు అప్పగించింది. పీసీసీ అధ్యక్షుడిగా ఇప్పటి వరకు వ్యవహరించిన రేవంత్ స్థానం మహేష్ గౌడ్ నియమితులయ్యారు. పీసీసీ చీఫ్ ఖరారులో సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇచ్చారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న మహేశ్‌కుమార్‌గౌడ్‌.. మూడేళ్లుగా టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా పార్టీ సంస్థాగత వ్యవహారాలు చూస్తున్నారు. మహేష్ ముందు ఏఐసీసీ బిగ్ టాస్క్ ఉంచింది. ఇప్పుడు అదే అసలైన సవాల్ గా మారుతోంది.

పీసీసీ చీఫ్ గా
విద్యార్ది సంఘ నేతగా రాజకీయాల్లో ప్రవేశించి..పీసీసీ చీఫ్ వరకు మహేష్ గౌడ్ చేరుకున్నారు. పీసీసీ చీఫ్ గా రేవంత్ నియామకం జరిగిన సమయం నుంచి మహేష్ గౌడ్ క్రియాశీలకం అయ్యారు. పార్టీలో పలు హోదాల్లో పని చేసిన మహేష్ గౌడ్ కు రేవంత్ కు బలమైన మద్దతుదారుగా వ్యవహరించారు. ప్రస్తుతం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న మహేష్ కు పీసీసీ చీఫ్ పదవి రావటంతో రేవంత్ కీలక భూమిక పోషించారు. అనేక మంది పేర్లు పరిశీలనలోకి వచ్చిన తరువాత సీఎం గా రేవంత్ కు సహకారం - సమన్వయంతో వ్యవహరించే నేతగా చివరకు మహేష్ పేరును ఏఐసీసీ ఖరారు చేసింది.

As TPCC president Mahesh Goud to face big task of party Coordination details here

ఏఐసీసీ బిగ్ టాస్క్
ఎన్నికల సమయంలో పలు హామీలు ఇచ్చిన కాంగ్రెస్ కు అధికారంలోకి వచ్చిన తరువాత వాటి అమలు సవాల్ గా మారుతోంది. రుణమాఫీ పైన ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. ఈ నెల 18 నుంచి కేసీఆర్ జిల్లాల పర్యటనలకు సిద్దం అవుతున్నారు. త్వరలో తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. బీజేపీ సైతం తెలంగాణలో పార్టీ బలోపేతం పైన ఫోకస్ చేసింది. ఈ సమయంలో పీసీసీ చీఫ్ గా మహేష్ గౌడ్ కు ఏఐసీపీ బిగ్ టాస్క్ అప్పగించింది. మిషన్ 2028 లక్ష్యంగా ప్రతీ అడుగు ఉండాలని స్పష్టం చేసింది. రేవంత్ తో కలిసి పార్టీ - ప్రభుత్వం మధ్య సమన్వయమే ప్రస్తుతం మహేష్ కు అసలైన సవాల్ గా కనిపిస్తోంది.

సమర్ధతకు పరీక్ష
కాంగ్రెస్ లో కీలక పదవుల్లో పని చేసిన సీనియర్లు ఉన్నారు. త్వరలో మంత్రివర్గ విస్తరణ..నామినేటెడ్ పదవుల భర్తీ చేయాల్సి ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో సీనియర్లు తమ వర్గానికి ప్రాధాన్యత కోసం పట్టబడటం సహజం. పార్టీ నేతలు ప్రభుత్వంలో ప్రాదాన్యత కోసం ప్రయత్నిస్తున్నారు. రేవంత్ తో మహేష్ కు సమన్వయంలో సమస్యలు ఉండే అవకాశం లేదు. కానీ, పీసీసీ చీఫ్ గా పార్టీలోని సీనియర్లను ఏకతాటి పైన తీసుకురావటం మహేష్ సమర్ధతకు పరీక్షగా నిలవనుంది. హామీల అమలు..పార్టీ - ప్రభుత్వం మధ్య గ్యాప్ లేకుండా సమన్వయం చేసుకుంటూ ..కేడర్ ను 2028 ఎన్నికలకు సమాయత్తం చేయటమే ఇప్పుడు మహేష్ గౌడ్ కు సవాల్ గా మారనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+