వేణుస్వామితో కలిసి కామాఖ్య ఆలయంలో అషు రెడ్డి రహస్య పూజలు!
జూనియర్ సమంత.. ఈ పేరు చెప్పగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది అషు రెడ్డి. పలు టీవీ షోలతో పాటు, సోషల్ మీడియాలో ఎప్పుడు సెన్సేషన్ సృష్టించే అషు రెడ్డి. తన బోల్డ్ నెస్ తో అందరిని ఆకట్టుకుంటుంది. బిగ్ బాస్ సీజన్ 3, బిగ్ బాస్ నాన్ స్టాప్ తో పాటు అనేక ప్రోగ్రామ్స్ లో సందడి చేసిన ఈ బుల్లితెర భామ ప్రస్తుతం చాలా బిజీగా ఉంది.
ప్రత్యేకమైన ఫాలోయింగ్ తో అషు రెడ్డి
తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న అషు రెడ్డి పలు వెబ్ సిరీస్ లు, సినిమాలు, టీవీ షో లతో బిజీగా ఉంది. యూట్యూబ్ లో సెలబ్రిటీలను ఇంటర్వ్యూలు చేస్తోంది. ఇక రాంగోపాల్ వర్మతో అషు రెడ్డి చేసిన ఇంటర్వ్యూ అమ్మడి బోల్డ్ నెస్ కు అద్దం పడుతుంది.

కామాఖ్య ఆలయంలో అషు రెడ్డి పూజలు
తన గ్లామర్ తో అందరి దృష్టిని ఆకట్టుకునే అషు రెడ్డి తాజాగా వేణు స్వామితో పాటు ఆలయంలో ప్రత్యక్షం కావడం ప్రస్తుతం అందరూ చర్చించుకునేలా చేసింది. ప్రముఖ కామాఖ్య ఆలయంలో అషు రెడ్డి వేణు స్వామి తో కలిసి దర్శనం ఇచ్చింది. కామాఖ్య శక్తి పీఠంలో అషు రెడ్డి పూజలు చేయించుకోవడం ప్రస్తుతం ఆసక్తికర చర్చకు కారణంగా మారింది.
వేణు స్వామితో కలిసి ప్రత్యేక పూజలు చేసిన అషు రెడ్డి
గతంలో అనేకమార్లు వేణు స్వామితో కలిసి ఆమె ప్రత్యేక పూజలు చేయించుకుంది. సెలబ్రిటీలకు జ్యోతిష్యం చెప్పే వేణు స్వామి, వారికి జాతకంలో ఏమైనా దోషాలు ఉంటే పరిహారంగా చేయవలసిన పూజలను చేస్తూ ఉంటారు. ఇక ఆయన దగ్గర చాలామంది పేరెన్నిక గన్న హీరోయిన్లు పూజలు చేయించుకుంటూ ఉంటారు. ఇక ఈ క్రమంలోనే తాజాగా అస్సాంలోని కామాఖ్య శక్తి పీఠంలో అషురెడ్డి వేణు స్వామితో ప్రత్యేక పూజలు చేయించుకుంది.
అషు రెడ్డి ఫోటోలు, వీడియోలు వైరల్
ఆపై అందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలను సోషల్ మీడియాలో అషు రెడ్డి షేర్ చేసింది. ఇప్పుడు అషు రెడ్డి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇక ఇదిలా ఉంటే ఈమధ్య అశ్వి రెడ్డి తన సోషల్ మీడియాలో తాను బ్రెయిన్ సర్జరీ కోసం ఆసుపత్రిలో జాయిన్ అయ్యే ముందు శాస్త్ర చికిత్స చేసే ముందు శస్త్ర చికిత్స చేసిన తర్వాత తాను ఎదుర్కొన్న పరిస్థితులను గురించి చూపించింది.
ఇటీవల అషు రెడ్డికి బ్రెయిన్ సర్జరీ
శస్త్ర చికిత్స చేయడం కోసం హెయిర్ కూడా కాస్త షేర్ చేయాల్సి వచ్చిందని అషు రెడ్డి పేర్కొంది. ఇక ఇప్పుడు అషు రెడ్డి అత్యంత శక్తివంతమైన కామాఖ్య శక్తి పీఠంలో ప్రత్యేక పూజలు నిర్వహించింది. ఈ శక్తి పీఠంలో ఇంతకుముందు ఐశ్వర్య రాజేష్, తమన్నా భాటియా వంటి అగ్ర సినీ తారలు కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు.












Click it and Unblock the Notifications