కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎఎస్సై మోహన్ రెడ్డి అక్రమ వడ్డీ దందా ఇంతింతియా కాదయా: మరో కేసు

By Pratap
|
Google Oneindia TeluguNews

కరీంనగర్‌: కరీంనగర్‌ జిల్లాలో ఏఎస్సై మోహన్‌రెడ్డిపై నమోదైన అక్రమ వడ్డీ వ్యాపారం కేసు విచారణ వేగం పుంజుకుంది. ఇప్పటి వరకు మోహన్‌రెడ్డితో పాటు మరో ఎనిమిది మంది బినామీలు, సహచరులను సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. మోహన్ రెడ్డిపై మరో కేసు నమోదైంది. ఆయనతో పాటు బినామీలు బోనాల మురళి, అంతం నరేష్ రెడ్డిలపై ఈ కేసు నమోదైంది

మోహన్‌రెడ్డి, అతడి బినామీల ఆస్తులను డాక్యుమెంట్‌ల ఆధారంగా లెక్కగట్టే పనిలో సీఐడీ పోలీసులు మునిగిపోయారు. మోహన్‌రెడ్డికి సంబంధించిన తాజా ఆస్తుల వివరాలను సేకరించడం కోసం ఏసీబీ కూడా రంగంలోకి దిగింది. 2006లో ఏసీబీ కేసు నమోదైన సమయంలో ఉన్న ఆస్తులను, ఇప్పటి ఆస్తులను బేరీజు వేసి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

అక్రమ వడ్డీ వ్యాపారం కేసులో ఏఎస్సై మోహన్‌రెడ్డి బినామీ అయిన పీ శ్రీధర్‌రెడ్డిని విచారించేందుకు సీఐడీ అధికారులకు నాలుగు రోజులపాటు కస్టడీకి అనుమతిస్తూ కరీంనగర్‌ అదనపు జుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ శనివారం ఆదేశాలు జారీ చేశారు. శ్రీధర్‌రెడ్డిని ఈ నెల 23న ఉదయం పదిన్నర గంటల నుంచి 26వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు సీఐడీ పోలీసులు తమ కస్టడీలోకి తీసుకోవటానికి కోర్టు అనుమతి ఇచ్చింది.

బెయిల్‌ కోసం శ్రీధర్‌రెడ్డి పెట్టుకున్న పిటిషన్‌పై విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. అక్రమ వడ్డీ వ్యాపారం, బెదిరించి ఆస్తులు కాజేసిన కేసులో మోహన్‌రెడ్డిపై కరీంనగర్‌ వన్ టౌన్ పోలీసు స్టేషన్‌లో శనివారం మరో కేసు నమోదైంది. మానకొండూర్‌ మండలం గంగిపెల్లికి చెందిన కోడూరి సత్యనారాయణ 2014 నవంబర్‌ 10న మోహన్‌రెడ్డి వద్ద రూ.55 లక్షలు అప్పుగా తీసుకున్నాడు.

ష్యూరిటీగా కరీంనగర్‌ కట్టరాంపూర్‌లో 15 గుంటల భూమి, ఇంటిని బోనాల మురళి, అంతం నరేష్ రెడ్డిల పేరిట జీపీఏ చేశాడు. నాలుగు నెలల పాటు వడ్డీ కింద రూ.9 లక్షల 5 వేలు చెల్లించాడు. మరో రెండు నెలల తర్వాత అతడిని బెదిరించి బలవంతంగా సంతకాలు తీసుకుని బోళ్ల శ్రీనివాస్‌ పేరిట రిజిస్టేషన్‌ చేయించారు. దీనిపై బాధితుడు సత్యనారాయ ణ పోలీసులకు ఫిర్యాదు చేయగా మోహన్‌రెడ్డితో పాటు బినామీలు బోనాల మురళి, అంతం నరేష్ రెడ్డి, బోళ్ల శ్రీనివాస్‌లపై కేసు నమోదు చేశారు.

ASI Mohan reddy's case: probe intensified
కడప శివారు ప్రాంతాల్లో కుంగిన భూమి
బుగ్గ ఆగ్రహారం, నాకిరెడ్డిపల్లి,
రెండు రోజులుగా భూమి కుంగుతోంది.
40 అడుగుల లోతు కుంగిపోయింది.
నీటిని విడుదల చేశారు.
భూమి లోపలి పొరల్లో జరుగుతున్న మార్పుల వల్లనే
కాలువల ఖాళీలు
బుగ్గవంక గ్రామస్థులు భాయందోళనలు
40 అడుగుల లోతు గుంతలు ఏర్పి
నీటి ఊటలు
15 నుంచి 20 అడుగుల లోతు
నాయినోరిపల్లి గ్రామస్థులు
బుగ్గవంక ప్రాజెక్టు దిగువ గ్రామాల్లో
English summary
An other case has been filed against Karimnagar ASI Moahan Reddy in illegal finance business.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X