నీట్ యూజీ పరీక్ష కేంద్రాల జాబితా నుంచి ఈ నగరాలు తొలగింపు

నీట్ 2023 పరీక్ష నిర్వహణకు సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) కీలక నిర్ణయాన్ని వెల్లడించింది.

హైదరాబాద్: నీట్ 2023 పరీక్ష నిర్వహణకు సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) కీలక నిర్ణయాన్ని వెల్లడించింది. ఈ ఏడాది ప్రవేశ పరీక్ష కేంద్రాల జాబితా నుంచి తెలంగాణ రాష్ట్రంలోని ఆసిఫాబాద్, మెదక్, వికారాబాద్‌లను తొలగించింది.

అన్ని వైద్య సంస్థలలో ఎంబీబీఎస్, బీడీఎస్, బీఏఎంఎస్, బీఎంఎంఎస్, బీయూఎంఎస్, కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 7న నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET) UG 2023 షెడ్యూల్ చేశారు.

గత ఏడాది 24కి గాను తెలంగాణ వ్యాప్తంగా 21 నగరాల్లో పరీక్ష జరగనుంది.

ఎన్టీఏ దేశవ్యాప్తంగా గత సంవత్సరం ఉన్న 543 టెస్ట్ సిటీలను.. ఇప్పుడు 485 కి తగ్గించింది. అయితే, భారతదేశం వెలుపల ఉన్న 14 నగరాలు అలాగే ఉన్నాయి.

Asifabad, Medak, Vikarabad dropped out of NEET-UG exam centre list

అభ్యర్థులు తమ దరఖాస్తు ఫారమ్‌ను ఆన్‌లైన్‌లో నింపేటప్పుడు పరీక్షా కేంద్రానికి వారి ప్రాధాన్యత క్రమంలో జాబితా నుంచి రెండు అనుకూలమైన నగరాలను ఎంచుకోవాలని సూచించారు.

అభ్యర్థులు వారి ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌లో చేసిన నగరాల ఎంపిక ప్రకారం పరీక్షా కేంద్రాలు కేటాయించడం జరుగుతుందని ఎన్టీఏ తెలిపింది.

అభ్యర్థి ఎంపిక చేసిన నగరాల్లో ఒకదానిలో కేంద్రాన్ని కేటాయించేందుకు అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ.. అభ్యర్థి ఎంపిక కాకుండా వేరే నగరంలో కేంద్రాన్ని కేటాయించే హక్కు ఎన్టీఏకి ఉందని నోటిఫికేషన్ స్పష్టం చేసింది.

ఇద్దరు అభ్యర్థులు ఒకే మార్కును స్కోర్ చేసినట్లయితే ర్యాంక్‌ను నిర్ణయించే ప్రమాణాలలో వయస్సు, ఆరోహణ క్రమంలో దరఖాస్తు సంఖ్య ఉండే మునుపటి పరీక్షల మాదిరిగా కాకుండా కొన్ని మార్పులు చేశారు. అయితే, టై బ్రేకింగ్ కోసం ఇతర ప్రమాణాలు అలాగే ఉంటాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+