ఆసియా ఆంద్రాబీ హైదరాబాద్ పర్యటించిందా: డిజిపి ఏమంటున్నారు?
హైదరాబాద్: కాశ్మీర్ వేర్పాటువాద నాయకురాలు ఆసియా ఆంద్రాబీ హైదరాబాద్‌లో పర్యటించినట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఆ వార్తలపై తెలంగాణ డిజిపి అనురాగ్ శర్మ బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో స్పందించారు. ఆంద్రాబీ హైదరాబాదులో పర్యటించినట్లు వస్తున్న వార్తలు నిజమేనని అన్నారు.
ఆమె హైదరాబాద్ వచ్చినట్లు కచ్చితమైన సమాచారం ఏదీ లేదని ఆయన స్పష్టం చేశారు. ఆమె రాకను ధ్రువీకరించాల్సి ఉందని, ఈ విషయంపై విచారణ కొనసాగుతోందని ఆయన అన్నారు. నాగపూర్‌లో పట్టుబడిన ముగ్గురు ఐఎస్ఐఎస్ సానుభూతిపరులు ఆంద్రాబీని కలిశారనే విషయంపై కూడా తమ వద్ద సమాచారం లేదని డిజిపి చెప్పారు.
కాశ్మీర్ వివాదాస్పద మహిళా నాయకురాలు ఆంద్రబీ నిరుడు హైదరాబాద్‌కు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. సిమీ వ్యవస్థాపకుడు సలావుద్దీన్ కుటుంబాన్ని ఆమె కలిసినట్లు చెబుతున్నారు. కాగా, ఇటీవల ఐసిస్‌లో చేరేందుకు ప్రయత్నించిన ముగ్గురు హైదరాబాద్ యువకులు కూడా ఆమెను కలిసినట్లు వార్తలు వస్తున్నాయి.

ఆసియా అంద్రాబీ ధక్థరాన్ - ఎ - మిల్లత్ (డిఇఎం- జాతీ కూతుళ్లు) వ్యవస్థాకురాలు. కాశ్మీర్‌లోని ఆల్ పార్టీస్ హురియత్ కాన్ఫరెన్స్‌లో అది ఓ అంతర్భాగం. భారత్‌ను స్వేచ్ఛ పొంది ప్రత్యేక కాశ్మీర్ ఏర్పాటుకు ఇది పనిచేస్తుంది.
ఆమె హిజుబుల్ ముజాహిదీన్ వ్యవస్థాపకుల్లో ఒకతను అయిన ఆషిక్ హుస్సేన్ ఫక్తూ భార్య కూడా. నాగపూర్‌లో అబ్దుల్ బాసిత్, సయ్యద్ ఒమర్, మాజ్ హుస్సేన్ అనే ముగ్గురు యువకులను గత వారం పోలీసులు అరెస్టు చేశారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications