జ్యోతిష్యుడు వేణుస్వామి ఇంట తీవ్ర విషాదం!
తెలుగు రాష్ట్రాలలో ప్రతి ఒక్కరికి తెలిసిన సెలబ్రిటీ జ్యోతిష్యుడు వేణు స్వామి ఇంట్లో నేడు తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వేణు స్వామి తల్లి విజయలక్ష్మి అనారోగ్యంతో మృతి చెందారు. ఇక ఈ విషయాన్ని స్వయంగా వేణు స్వామి తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తన ఫాలోయర్స్ కు తెలిపారు.
వేణు స్వామి తల్లి మృతి .. ఫాలోయర్స్ సానుభూతి
ఈరోజు ఉదయం మా అమ్మగారు పరమపదించారు అంటూ సోషల్ మీడియా వేదికగా వేణు స్వామి పోస్ట్ పెట్టారు. ఇక వేణు స్వామి సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ చూసిన వేణు స్వామి ఫాలోయర్స్ ఆయనకు తమ సానుభూతిని తెలుపుతున్నారు. తల్లిని కోల్పోయిన మీరు ఈ సమయంలో తీవ్రవేదనకు గురవడం సహజమే అయినప్పటికీ ధైర్యంగా ఉండండి అంటూ వేణు స్వామిని ఓదారుస్తున్నారు.

వైఎస్ జగన్ ఓటమితో సెలబ్రిటీల జాతకం చెప్పనన్న వేణు స్వామి
ఇక వేణు స్వామి విషయానికి వస్తే సోషల్ మీడియా వేదికగా సినీ రాజకీయ ప్రముఖుల జాతకాలు చెబుతూ వేణు స్వామి ఎప్పటికప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేస్తూ టాక్ ఆఫ్ తెలుగు స్టేట్స్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గత ఎన్నికలలో వైఎస్ జగన్ గెలుస్తారని చెప్పిన వేణు స్వామి వైయస్ జగన్ ఓటమిపాలు కావడంతో తన జ్యోతిష్య అంచనాలు తప్పు కావడంతో మరెప్పుడూ సెలబ్రిటీల జ్యోతిష్యం చెప్పనని సంచలన ప్రకటన చేశారు.
నాగచైతన్య, శోభితల వైవాహిక జీవితంపై అంచనా చెప్పిన వేణు స్వామి
ఏపీ ఎన్నికల విషయంలో వేణు స్వామి చెప్పిన జ్యోతిష్యం తప్పు కావడంతో సోషల్ మీడియాలోనూ వేణు స్వామి విపరీతమైన ట్రోలింగ్ ఎదుర్కొన్నారు. ఇక సెలబ్రిటీల జ్యోతిషం చెప్పనని చెప్పిన వేణు స్వామి నాగచైతన్య శోభిత ధూళిపాళ్ల ఎంగేజ్మెంట్ అయిన తర్వాత రోజు వారిద్దరి వైవాహిక జీవితం ఏ విధంగా ఉంటుందో చెప్పే ప్రయత్నం చేస్తూ వారిద్దరూ కలిసి ఉండే అవకాశం లేదని నాగచైతన్యకు పిల్లలు పుట్టే అవకాశం లేదని బాంబు పేల్చారు.
ఫిర్యాదులు, కేసులు... కాంట్రవర్సీలకు కేరాఫ్ వేణు స్వామి
ఆ తర్వాత వేణు స్వామి జ్యోతిష్యంపైన మహిళా సంఘాలు మండిపడటం, మహిళా కమీషన్ కు ఫిర్యాదు చెయ్యటం, అలాగే పోలీస్ స్టేషన్ లో కూడా సినీ పరిశ్రమకు చెందిన డిజిటల్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ ఫిర్యాదులు చేయడం ఆయన మీద కేసులు నమోదు కావడం వంటి అనేక సంఘటనలతో పాటు సంచలన వ్యాఖ్యలతో వేణు స్వామి ఎప్పుడు వార్తల్లోనే ఉంటున్నారు.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications