డాడీ! ఇతనంటే నాకిష్టమంటే పెళ్లి చేసేవాడిని, నా భార్యే కారణం: మాధవి తండ్రి

హైదరాబాద్: కూతురు మాధవి, అల్లుడు సందీప్ పైన కత్తితో దాడి చేసిన మనోహరాచారిని ఓ న్యూస్ ఛానల్ పలకరించింది. ఈ సందర్భంగా అతను మాట్లాడాడు. తనకు తన కూతుర్ని కాకుండా భార్యను చంపితే సరిపోయేదన్నాడు. తాను ఆవేశంలో దాడి చేశానని, చంపాలనుకోలేదన్నాడు. బెదిరించాలనుకున్నానని చెప్పాడు.

తాను తన కూతురు మాధవిని చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమగా పెంచానని, కానీ తనను మోసం చేసిందని చెప్పాడు. దీనికంతటికీ తన భార్య కూడా కారణం అన్నారు. కూతురుపై దాడి కాకుండా భార్యను చంపేస్తే బాగుండునని అన్నారు. తాను తొందరపడి తప్పు చేశానని అన్నాడు. నాకు ఓ మాట చెబితే నేనే పెళ్లి చేసేవాడినని చెప్పాడు. తన భార్య, కొడుకులకు ఈ విషయం చెప్పి, తనకు చెప్పలేదన్నాడు.

డాడీ నాకు ఈయన కావాలంటే పెళ్లి చేసేవాడిని

డాడీ నాకు ఈయన కావాలంటే పెళ్లి చేసేవాడిని

తన కూతురు మాధవి పెళ్లి విషయం అందరికీ చెప్పిందని, తనకు చెప్పలేదని, అందుకే ఆవేశంలో దాడి చేశానని మనోహరాచారి అన్నాడు. నేను నా బిడ్డ పైనే దాడి చేయాలనుకున్నానని చెప్పాడు. తనకు చెప్పకుండా పెళ్లి చేసుకుందని, వాళ్ల అమ్మకు, అన్నకు, చుట్టాలకు అందరికీ చెప్పిందని, తనకు మాత్రం చెప్పలేదన్నాడు. డాడీ.. నేను పెళ్లి చేసుకుంటాను, ఈయనే నాకు కావాలి అంటే నేను పెళ్లి చేసేవాడిని కదా అన్నాడు.

బతకాలని కోరుకుంటున్నా

బతకాలని కోరుకుంటున్నా

దాడి జరిగిన సమయంలో తాను బట్టలు ఇప్పిస్తానని చెప్పి రమ్మనలేదని, బయటకు రమ్మని మాత్రమే చెప్పానని మనోహరాచారి అన్నాడు. నేను కొడదామనుకున్నానని, కానీ మద్యం తాగి ఉన్నానని, కాబట్టి ఎక్కువ తాకిందని చెప్పాడు. నా కూతురు బతకాలని కోరుకుంటున్నానని చెప్పాడు.

 మాధవి సోదరుడు ఏం చెప్పాడంటే?

మాధవి సోదరుడు ఏం చెప్పాడంటే?

మాధవి సోదరుడు సాయికృష్ణ మాట్లాడుతూ.. రెండు రోజుల క్రితం తమకు పెళ్లి గురించి చెప్పిందని అన్నాడు. తన తల్లికి ఏమాత్రం సంబంధం లేదన్నాడు. అమ్మ పని చేసుకుంటుందని ఏం తెలియదన్నాడు. సందీప్ మంచివాడో కాదో తనకు తెలియదన్నాడు. డిగ్రీ సెకండియర్ చేస్తాడని, హోటల్లో పని చేస్తాడని మాత్రమే తెలుసన్నాడు. ఇలాంటి పరిస్థితి వస్తుందనుకోలేదన్నాడు. తన తండ్రికి పెళ్లి విషయం తెలియదన్నాడు.

సందీప్ ఏం చెప్పాడంటే?

సందీప్ ఏం చెప్పాడంటే?

తనకు మాధవితో 2013లో పరిచయమైందని, ఆ పరిచయం ప్రేమగా మారిందిని, 2015లో మాధవి వాళ్లింట్లో ప్రేమ విషయం తెలిసిందని, దీంతో ఆమె తల్లిదండ్రులు, బంధువులు మా ఇంటికి వచ్చి బెదిరించారని, అప్పటి నుంచి మమ్మల్ని వేధిస్తున్నారని అబ్బాయి సందీప్ చెప్పాడు. ఇప్పుడు మాధవి ఇంటి నుంచి వచ్చేయడంతో ఈ నెల 12వ తేదీన ఓ గుళ్లో పెళ్లి చేసుకున్నామని, ఈ పెళ్లికి తన తల్లిదండ్రులు కూడా మొదట అభ్యంతరం చెప్పారన్నాడు. ఆ తర్వాత అంగీకరించారని చెప్పాడు. పెళ్లి తర్వాత కూడా మాధవి తల్లిదండ్రులు మా ఇంటికి వచ్చి బాగా మాట్లాడారని, ఆ సమయంలో తన కూతురిని కష్టపెడితే మాత్రం చంపడానికైనా వెనుకాడనని మాధవి తండ్రి తనను హెచ్చరించాడని, కూతురిపై ప్రేమతోనే అలా బెదిరించాడని అనుకున్నానని, బుధవారం ఆయనే స్వయంగా ఫో్ చేసి తన కూతురును చూడాలని ఉందని రమ్మని చెప్పాడని, తాగుడు అలవాటు ఉండటంతో ఇంటికి వచ్చి గొడవ చేస్తే పరువు పోతుందని భావించి బయటకి వెళ్లామని, ఆ సమయంలో దాడి జరిగిందన్నాడు. మాధవిపై విచక్షణారహితంగా దాడి చేశాడన్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+