విద్యార్థులకు భారీ శుభవార్త.. 5 రోజులు సెలవులు..!

విద్యార్థులకు గుడ్ న్యూస్. ఆగస్టులో వరుస సెలవులు రానున్నాయి. ఆగస్టు 15 వ తేదీలోపే స్కూల్స్ కు వరుసగా సెలవులు ఉండనున్నాయి. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌ లోని స్కూల్, కాలేజీ విద్యార్థుల తోపాటు ఉద్యోగులకు కూడా ఈ నెలలో వరుస సెలవులు వస్తున్నాయి. ఇందుకు కారణంగా ఆగస్టు నెలలో పండగలు, ప్రత్యేక రోజులు అధికంగా ఉండటమే. అయితే రోజూ చదువులోపడి తలమునకలు అవుతున్న స్టూడెంట్స్ బిగ్ రిలీఫ్ లభించనుంది. ఆ సెలవుల వివరాలు ఓసారి పరిశీలిస్తే..

ఓ పాతికేళ్ల కిందట పాఠశాలలో ఉన్న టైమింగ్స్ కు ఇప్పటి టైమింగ్స్ కు పొంతన లేకుండా పోయింది. మారుతున్న జీవన విధానం, పోటీ ప్రపంచం కారణంగా పరిస్థితులు మారిపోయాయి. అప్పట్లో స్కూల్ అంటే ఉదయం 10కి మొదలై.. సాయంత్రం 4.30కి ముగిసేది. చివర్లో గేమ్స్ పీరియడ్ కూడా ఉండేది. దీంతో విద్యార్థులు ఆడుతూ పాడుతూ స్కూల్‌ కు వెళ్లేవారు. బుక్స్ కూడా చాలా తక్కువ ఉండేవి. కానీ ఇప్పుడు మారిపోయింది. ఉదయం 8.30 కే స్కూల్ ప్రారంభమైపోతుంది. సాయంత్రం 5 వరకూ ఉంటుంది. ఆ తర్వాత ట్యూషన్ పేరుతో రాత్రి 7 అయిపోతుంది. దీంతో విద్యార్థులు కాస్త రిలీఫ్ గా ఉండేది హాలీడేస్ లోనే.

August Bonanza for Students Telangana Schools Get 5-Day Holiday before Aug 15

ఈసారి ఆగస్టు 9న రాఖీ పండుగ నేపథ్యంలో ఆ రోజు శనివారం స్కూళ్లకు సెలవు ఉంది. అలాగే ఆగస్టు 10న ఆదివారం కావడంతో వరుసగా రెండు రోజులు సెలవులు వచ్చాయి. ఆగస్టు 11 నుంచి 4 రోజులు స్కూలుకు వెళ్తే.. 5వ రోజు ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం కారణంగా సెలవు ఉంది. అంటే ఆ రోజున స్కూల్‌ కు వెళ్లి స్వాతంత్ర్య సమర యోధులను స్మరించుకోవాలి. ఆ తర్వాత సెలవు ఉంటుంది. ఆ తర్వాత ఆగస్టు 16న కృష్ణాష్టమి కావడంతో ఆ శనివారం సెలవు ఉంది. ఇక ఆగస్టు 17న ఆదివారం కావడంతో హాలీడే ఉంటుంది. ఇలా మొత్తం 5 రోజులు సెలవులు వస్తున్నట్లుగా భావించవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+