ట్యూషన్‌కు భార్య అనుష్క: నమ్మించి ఆటో డ్రైవర్ చోరీ (ఫొటో)
హైదరాబాద్: ఓ రిటైర్డ్ హెడ్ మాస్టర్ ఇంట్లో చోరీకి పాల్పడిన ఆటో డ్రైవర్‌ను హైదరాబాదులోని కాచిగుడా పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి ఆరు తులాల బంగారం, 10 తులాల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఎసిపి చెబ్రోలు లక్ష్మినారాయణ శుక్రవారం మీడియా సమావేశంలో వెల్లడించారు.
కాచిగుడా నింబోలిఅడ్డ శివాలయం సమీపంలో నివసిస్తున్న అంబాడిగూడ శివారెడ్డి ఆటో డ్రైవర్. ఇతడి భార్య అనుష్క ఇంటర్మీడియట్ చదువుతోంది. బద్రుకా కళాశాల సమీపంలోని రహ్మత్‌బాగ్‌లో నివాసం ఉంటున్న విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు సత్యనారాయణ వద్దకు ట్యూషన్‌కు వెళ్తోంది.
సత్యనారాయణ ఇంటి పక్కనే ఆయన కూతురు మాలరాణి నివాసం ఉంటోంది. ఒంటరిగా ఉంటున్న సత్యనారాయణ ఇంట్లో అనుష్క కలివిడిగా తిరిగేది. ఇదే అదునుగా భావించిన ఆమె భరత్ శివారెడ్డి సత్యనారాయణ ఇంటికి గత నెల 28వ తేదీన భార్యను తీసుకుని వెళ్లాడు.

ఆ సమయంలో సత్యనారాయణ బాత్రూంలో ఉన్నాడు. దాన్ని ఆసరా చేసుకుని శివారెడ్డి బీరువాలో ఉన్న బంగారు, వెండి ఆభరణాలను దొంగిలించాడు. సత్యనారాయణ బయటకు వచ్చి చూడగా బీరువా తలుపు తెరిచి ఉంది. అనుమానం వచ్చి చూశాడు.
బీరువాలో తన కూతురు దాచుకున్న ఆభరణాలు కనిపించకపోవడంతో కాచిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఇంటికి వచ్చినవారి వివరాలు సేకరించి శివారెడ్డిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అతను నేరం అంగీకరించాడు.












Click it and Unblock the Notifications