25 అడుగుల లోతులో పడిన ఆటో: అయినా బతికారు (పిక్చర్స్)

హైదరాబాద్: ఓ ఆటో హైదరాబాదులోని బంజారాహిల్స్‌లో 25 అడుగుల లోతులో పడిపోయింది. అయినా అందులోని వారు బతికి బయటపడ్డారు. కార్మికులతో వెళ్తున్న ఆటో 25 అడుగుల ఎత్తు నుంచి కిందకు పడటంతో అందులో ఉన్న 10 మంది గాయపడ్డారు.

హైదరాబాదు బంజారాహిల్స్‌ పోలీసుల కథనం ప్రకారం - బంజారాహిల్స్‌ రోడ్డు నం.12లోని ఎన్బీటీనగర్‌కు చెందిన కార్మికులు జిత్తు, భద్రు, చందు, ఈరన్న, నాగయ్య, బన్ని, భిక్షపతి, వెంకటేష్‌, వెంకన్న గురువారం ఉదయం ఆటోలో ఫిలింనగర్‌ వెళ్తున్నారు. ఎన్బీటీనగర్‌ నుంచి టోలిచౌకి మార్గంలో వెళ్తుండగా ఆటో బ్రేకులు విఫలమయ్యాయి.

డ్రైవర్‌ రాజు ఆటోను అదుపు చేసే ప్రయత్నం చేస్తుండగానే రహదారి పక్కనున్న 25అడుగుల లోతున్న గొయ్యిలోకి పడిపోయింది. అందులో ఉన్న కార్మికులు హాహాకారాలు చేశారు. పరిమితికి మించి అందులో ప్రయాణిస్తుండటంతో ఒకరిపై ఒకరు కుక్కినట్లు పడిపోయారు.

వారి అరుపులు విన్న స్థానికులు చేరుకుని ఆటోలో ఇరుక్కున్న వారిని బయటకు తీశారు. 108లో క్షతగాత్రులను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. వీరిలో ముగ్గురు పరిస్థితి కాస్త ఆందోళనకరంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

25 అడుగుల లోతులో ఆటో...

25 అడుగుల లోతులో ఆటో...

బంజారాహిల్స్‌లో ఓ ఆటో అదుపు తప్పి 25 అడుగుల లోతులో పడింది. అందులో ప్రయాణిస్తున్నవారు తీవ్రంగా గాయపడ్డారు.

ఆటో ప్రమాదాన్ని తిలకిస్తున్న స్థానికులు

ఆటో ప్రమాదాన్ని తిలకిస్తున్న స్థానికులు

ఆటో అదుపు తప్పి గొయ్యిలో పడిపోవడం స్తానికులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. వారు ఇలా చూస్తూ కనిపించారు.

స్థానికులు బయటకు తీశారు...

స్థానికులు బయటకు తీశారు...

ప్రమాదానికి గురైనవారిని స్థానికులు ఆటో నుంచి వెలికి తీసి రక్షించారు. వారు ఇలా సహాయక చర్యల్లో పాల్గొన్నారు.

పరిమితికి మించి ప్రయాణం..

పరిమితికి మించి ప్రయాణం..

పరిమితికి మించి ప్రయాణించడం వల్లనే ఆటో ప్రమాదానికి గురైనట్లు భావిస్తున్నారు. ఆటోలో చిక్కుకున్నవారిని స్థానికులు వెలికి తీశారు.

అంత ఎత్తు నుంచి పడింది....

అంత ఎత్తు నుంచి పడింది....

ఆటో ఎంత ఎత్తు నుంచి పడిందో ఈ చిత్రంలో స్పష్టంగా కనిపిస్తోంది. ఆటో అదుపు తప్పి ఇలా గోతిలో పడింది.

ఇలా తరలించారు...

ఇలా తరలించారు...

ఆటో ప్రమాదంలో గాయపడినవారిని సురక్షితంగా బయటకు తీసి ఇలా ఆస్పత్రికి తరలించారు.

ఇలా తరలింపు...

ఇలా తరలింపు...

ఆటో ప్రమాదంలో గాయపడినవారిని ఇలా 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు. గాయపడినవారిలో కొంత మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రమాద దృశ్యాలు...

ప్రమాద దృశ్యాలు...

ఆటో 25 అడుగుల లోతు గోతిలో పడడంతో అందులో ప్రయాణిస్తున్న కార్మికులు తీవ్ర గాయాల పాలయ్యారు. వారిని ఆస్పత్రికి తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+