భార్యను వ్యభిచారంలోకి దించడానికి ఫ్రెండ్ యత్నం: ముఠా దాడిలో ఆటో డ్రైవర్ మృతి

హైదరాబాద్: ఓ ఆటో డ్రైవర్ భార్యను ఆమె స్నేహితురాలు వ్యభిచారంలోకి దించడానికి ప్రయత్నించింది. ఆ ప్రయత్నాన్ని అడ్డుకోబోయిన ఆటో డ్రైవర్ భార్య స్నేహితురాలి సహాయకుల చేతిలో హతమయ్యాడు. ఈ సంఘటన హైదరాబాదులోని చాంద్రాయణగుట్ట ప్రాంతంలో జరిగింది.

ఇన్‌స్పెక్టర్ రామారావు కథనం ప్రకారం.. బాబానగర్ ఉమర్ హోటల్ సమీపంలో నివసించే సమీ అహ్మద్ సిదిఖ్(22), అస్మాఖాన్(21) ఏడాది క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి తొమ్మిది నెలల పాప ఉంది. సమీ అహ్మద్ ఆటో నడుపుతూ తల్లిదండ్రులతో ఉంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అయితే, పది రోజుల క్రితం అస్మాఖాన్ స్నేహితురాలు అజ్మసుల్తాన ఓ వ్యక్తితో కలిసి రాత్రి సమయంలో సమీ అహ్మద్ ఇంటికి వచ్చింది.

దీన్ని చూసిన సమీ అహ్మద్ తండ్రి ఫసీ అహ్మద్ సిదీఖ్ వారు ఎందుకు వచ్చారంటూ గొడవ చేశాడు. దీంతో సమీ అహ్మద్, ఆస్మాఖాన్ ఇటీవల ఉమర్ హోటల్ సమీపంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని ఉంటున్నారు. ఈ క్రమంలో ఖర్చులు పెరిగి ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. దీన్ని ఆసరా చేసుకున్న అజ్మసుల్తానా ఈవెంట్ మ్యారేజ్‌లో పని ఇప్పిస్తానని నమ్మించి స్నేహితురాలు అస్మాఖాన్‌ను వెంట తీసుకెళ్లింది.

Automan killed in fight over wife in sex business

ఇంటి సమీపంలో ఆగి ఉన్న కారులో ఆస్మాఖాన్‌ను ఎక్కించింది. ముఖ్తార్ అనే వ్యక్తి కారు నడుపుతూ కొంత దూరం తీసుకెళ్లగానే మరో ఇద్దరు వ్యక్తులు అదే కారులో ఎక్కడంతో అనుమానించిన అస్మాఖాన్ భర్తకు ఫోన్ చేసింది. వెంటనే భార్య కోసం రోడ్డుపైకి వచ్చిన సమీ అహ్మద్ ఆ కారును అడ్డుకున్నాడు. వారితో ఎక్కడికి వెళ్తున్నావని ఆస్మాఖాన్‌ను కొట్టాడు.

దీంతో కారులోని వ్యక్తులు అక్కడి నుంచి జారుకున్నారు. అయితే, అసలు జరిగిన విషయం భార్య చెప్పిన తర్వాత ఆ వ్యక్తులకు ఫోన్ చేయడంతో వారు చాంద్రాయణగుట్ట ఫ్లై ఓవర్ ప్రాంతానికి రమ్మని చెప్పారు. కోపంతో ఆ ప్రాంతానికి చేరుకున్న సమీ అహ్మద్ వారితో గొడవకు దిగాడు. దీంతో ఆ ముగ్గురిలో ఓ వ్యక్తి కత్తితో అతడి మెడపై దాడి చేశాడు.

తీవ్ర రక్తస్రావం కావడంతో సమీ అహ్మద్‌ను భార్య డీఆర్‌డీఎల్ సమీపంలోని ఓవైసీ ఆస్పత్రికి తరలించింది. అప్పటికే బాధితుడు మృతి చెందినట్లు డాక్టర్లు వెల్లడించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దాడి జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. కాగా, హత్య చేసిన దుండగులు పరారీలో ఉన్నారు. కేసును చాంద్రాయణగుట్ట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+