రేవంత్‌ సర్కార్‌ ముందు సెంటిమెంట్ డిమాండ్ పెట్టిన బండి సంజయ్

Ayodhya Ram Mandir: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవ గడువు సమీపించింది. ఇంకో మూడు రోజులు మిగిలివుంది. ఈ నెల 22వ తేదీన మధ్యాహ్నం మహోజ్వల ఘట్టం ఆరంభమౌతుంది. కోట్లాదిమంది హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడి జన్మించిన స్థలంలో ఆలయం అందుబాటులో రానుంది.

రామమందిరం ప్రారంభోత్సవాన్ని దృష్టిలో పెట్టుకుని మోదీ.. సరికొత్త ఉద్యమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా అన్ని ఆలయాలనూ పరిశుభ్రంగా ఉంచేలా స్వచ్ఛ అభియాన్‌ను ప్రారంభించారు. నాసిక్‌లోని ప్రాచీన కాలా రామ్ ఆలయం ప్రాంగణం మొత్తాన్నీ శుభ్రపరిచారు.

Ayodhya Ram Mandir: Bandi Sanjay demands holiday on Jan 22

తాజాగా- బీజేపీ రాష్ట్రశాఖ మాజీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎల్లంతకుంట శ్రీ సీతా రామచంద్రస్వామి ఆలయం, కరీంనగర్ శివ రామాలయంలల్లో స్వచ్ఛ అభియాన్ నిర్వహించారు. చీపురు పట్టి ఆలయం మొత్తం ఊడ్చారు. చెత్తను ఎత్తి పడేశారు. విగ్రహాలను పైప్‌తో నీటిని చల్లి శుభ్ర పరిచారు.

ఈ సందర్భంగా బండి సంజయ్ విలేకరులతో మాట్లాడారు. అయోధ్యలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవాన్ని దృష్టిలో ఉంచుకుని 11 రోజుల పాటు ఆలయాల్లో స్వచ్ఛ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించాలంటూ మోదీ పిలుపునిచ్చారని, ఆయన పిలుపునకు లక్షలాది మంది స్పందిస్తోన్నారని పేర్కొన్నారు.

జనవరి 22వ తేదీన అన్ని ఆలయాల్లో దీపాలను వెలిగించి, పండగ వాతావరణంలో రామాలయ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని జరుపుకోవాలని సూచించారు. ఈ మహోన్నత కార్యక్రమం కోసం తెలంగాణ సమాజం ఆశతో ఎదురు చూస్తోందని, దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆ రోజున రాష్ట్రవ్యాప్తంగా సెలవు ప్రకటించాలని డిమాండ్ చేశారు.

Ayodhya Ram Mandir: Bandi Sanjay demands holiday on Jan 22

అన్ని కార్యక్రమాలను పక్కన పెట్టి.. రామమందిరం ప్రారంభోత్సవ ఘట్టాన్ని వీక్షించడానికి ఉద్యోగులు సెలవులు పెడుతున్నారని పేర్కొన్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారస్తులు.. తమ రోజువారి కార్యక్రమాలన్నింటినీ పక్కన పెడుతున్నారని, పేద- ధనిక అనే తేడా లేకుండా పండగలా జరుపుకోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు.

ఇది- బీజేపీ కార్యక్రమం కాదని, దేశ ప్రజలందరిదని బండి సంజయ్ అన్నారు. బీజేపీ కార్యక్రమం అనే భ్రమలో ఉన్నవారు ఇప్పటికైనా తమ అభిప్రాయాన్ని మార్చుకోవాలని విజ్ఞప్తి చేశారు. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తలు సైతం ఇందులో పాల్గొంటోన్నారని, ఇది రాజకీయాలకు అతీతంగా జరుగుతున్న కార్యక్రమం అని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+