100మంది అమ్మాయిలు ఫేస్‌బుక్: నగ్నచిత్రాలతో టెక్కీ విద్యార్థి బ్లాక్‌మెయిల్
హైదరాబాద్: ఫేక్ ఫేస్‌బుక్ అకౌంటుతో వందమంది వరకు అమ్మాయిల వ్యక్తిగత వివరాలు, వారి న్యూడ్ ఫోటోలు క్రియేట్ చేసి, బ్లాక్ మెయిల్ చేస్తున్న నిందితుడిని హైదరాబాద్ పోలీసులు శుక్రవారం నాడు అరెస్టు చేశారు. ఓ అమ్మాయి ఫిర్యాదు చేయడంతో ఇది వెలుగు చూసింది.
అబ్దుల్ మాజిద్ అనే యువకుడు ఫేక్ ఫేస్‌బుక్ ద్వారా అమ్మాయిలకు వల వేస్తున్నాడు. ఆరు ఫేస్‌బుక్ అకౌంట్లు క్రియేట్ చేశాడు. తాను కూడా అమ్మాయిలాగా అకౌంట్ తెరిచి.. దాదాపు వందమంది అమ్మాయిలతో పరిచయం పెంచుకున్నాడు.

వారి వ్యక్తిగత విషయాలు తెలుసుకునే స్థాయికి పరిచయం పెంచుకున్నాడు. అంతేకాదు, వారి నగ్న చిత్రాలను సంపాదించడం లేదా క్రియేట్ చేయడం..., వాటిని చూపించి అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు గుంజుతున్నాడు.
బాధితుల్లో పలు స్కూళ్లు, కాలేజీలలోని ప్రముఖుల పిల్లలు ఉన్నట్లుగా తెలుస్తోంది. అబ్దుల్ మాజిద్ బిటెక్ విద్యార్థి. అతను పదో తరగతి నుంచి ఇంటర్, డిగ్రీ విద్యార్థి అమ్మాయిలను లక్ష్యంగా చేసుకొని ఈ బ్లాక్ మెయిల్‌కు పాల్పడ్డాడు.












Click it and Unblock the Notifications