కారు ఢీకొట్టింది వెళ్లింది: 24 రోజుల తర్వాత సంజన ఇలా...

హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో గాయపడి కోమాలోకి వెళ్లిన ఆరేళ్ల సంజన గురువారంనాడు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయింది. చావుబతులకు మధ్య ఉన్న తల్లీకూతుళ్లను కామినేని వైద్యులు చికిత్సలు అందించి పునర్జన్మ ప్రసాదించారు.

హైదరాబాదులోని కింగ్‌కోఠి కామినేని ఆస్పత్రిలో మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రసాదరావు బుధవారం బాలిక, తల్లిదండ్రులతో కలిసి వివరాలు వెల్లడించారు. మల్కాజ్‌గిరి ప్రాంతంలో ఉండే శివానంద్ భార్య,కూతురుతో కలిసి ఈనెల 2న అంబర్‌పేట్‌కు వచ్చారు.

రాత్రి 8.30 గంటల సమయంలో రోడ్డు పక్కన నిలిచి ఉన్న తల్లి, కూతుర్లను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తల్లికి గాయాలు కాగా, కూతురు సంజన తీవ్రంగా గాయపడింది. వారిని కింగ్‌కోఠిలోని కామినేని ఆస్పత్రికి తరలించారు.

 సంజన కోమాలోకి వెళ్లింది...

సంజన కోమాలోకి వెళ్లింది...

కారు ఢీకొట్టిన తర్వాత ఆస్పత్రికి తరలించేలోగానే సంజన కోమాలోకి వెళ్ల గా చాతిభాగంలో గాయాలయ్యాయి. అంతేకాకుం డా థిల్లీ (స్ప్లీన్) దెబ్బతినగా తొడ ఎముక విరిగిపోయింది. అనేక రకాల గాయాలతో ఆస్పత్రిలో చేరిన సంజన కేసును సవాలుగా తీసుకున్న వైద్యులు ఆరోగ్యశ్రీ కింద ఆమెకు వైద్యచికిత్సలు అందించారు.

పది రోజుల పాటు వెంటిలేటర్‌పై....

పది రోజుల పాటు వెంటిలేటర్‌పై....

సుమారు పది రోజులపాలు బాలిక వెంటిలేటర్‌పై చావుబతుకులతో పోరాటం చేసింది. చికిత్సలు ఫలిం చి కోమా నుంచి బయటపడింది. తొడ గాయం కూడా మూడు వారా ల్లో తగ్గి నడువగలుగుతుందని వైద్యులు చెప్పారు. ఈ సందర్భంగా శివానంద్ వైద్యులు కృతజ్ఞతలు తెలిపారు.

 24 రోజుల పాటు ఆస్పత్రిలో...

24 రోజుల పాటు ఆస్పత్రిలో...

గత 24 రోజుల పాటు సంజన (4) ఆస్పత్రిలో చికిత్స పొందింది. మద్యం తాగి కారు నడపడం వల్లనే ఆ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. 24 రోజుల పాటు నకరం అనుభవించిన సంజన ఇంటికి చేరింది

 తల్లి ఇదివరకే డిశ్చార్జీ....

తల్లి ఇదివరకే డిశ్చార్జీ....

ఆ ప్రమాదంలో గాయపడిన సంజన తల్లి శ్రీదేవి గత వారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ అయింది. చేయని నేరానికి తల్లీకూతుళ్లు గాయపడి ఆస్పత్రి పాలయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+