భంగపడ్డ కోదండ, 'తెలంగాణ'పై కుట్రకు తెరలేపారు: మండిపడ్డ సుమన్

తెలంగాణ జేఏసీ చైర్మన్ ఆచార్య కోదండరాం పైన తెరాస నేత, పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ గురువారం నాడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏదో ఊహించుకొని ర్యాలీకి పిలుపునిచ్చి కోదండరాం భంగపడ్డారని విమర్శించారు.

హైదరాబాద్: తెలంగాణ జేఏసీ చైర్మన్ ఆచార్య కోదండరాం పైన తెరాస నేత, పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ గురువారం నాడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏదో ఊహించుకొని ర్యాలీకి పిలుపునిచ్చి కోదండరాం భంగపడ్డారని విమర్శించారు.

తెలంగాణ విఫల ప్రయోగం అని చెప్పేందుకు ఆయ‌న మరిన్ని కుట్రలకు తెరలేపే అవకాశం ఉందని ఆయన ఆరోపించారు. ఇలాంటి కుట్రల పట్ల తెలంగాణ సమాజం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

రాజకీయ స్వార్థం కోసం నిరుద్యోగ యువతను కోదండ‌రాం రెచ్చగొడుతున్నారన్నారు. హైదరాబాద్ విశ్వనగరంగా మారుతున్న పరిస్థితిని చెడగొట్టేందుకు య‌త్నిస్తున్నారన్నారు. ఇకనైనా ఇలాంటి కుట్రలను మానుకోవాలన్నారు.

Balka Suman lashes out at Kodandaram for Nirudyoga Rally

ర్యాలీని పట్టించుకోనందుకు నిరుద్యోగ యువతకు బాల్క సుమన్ కృతజ్ఞతలు తెలిపారు. నిరుద్యోగ ర్యాలీకి దూరంగా ఉండి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పట్ల తమ విశ్వాసాన్ని చాటారని అభినందించారు.

టీజేఏసీలో అసంతృప్తి ఉందా?

కోదండరాం వ్యవహారశైలి పైన జేఏసీ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. స్టీరింగ్ కమిటీ సమావేశానికి కొందరు నేతలు గైర్హాజరయ్యారు. కన్వీనర్ రవీంద్ర సమావేశాన్ని బహిష్కరించారు.

కోదండరాం ఒంటెద్దు పోకడలు పోతున్నారని నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు. నాగోల్‌లో నిరుద్యోగ ర్యాలీని ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు. కోదండరాం వ్యక్తిగత ప్రతిష్టలకు పోతున్నారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+