తెలంగాణ మండలి డిప్యూటీ చైర్మన్ ఖరారు..!!
తెలంగాణ శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేసారు.
తెలంగాణ శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేసారు. ఎమ్మెల్సీ బండా ప్రకాశ్ ముదిరాజ్ ను ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు (శనివారం) ప్రకాశ్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. మండలి డిప్యూటీ చైర్మన్‌గా వ్యవహరించిన ఎమ్మెల్సీ నేతి విద్యాసాగర్ పదవీకాలం 2021, జూన్ 3న పూర్తయింది. దీంతో అప్పటినుంచి డిప్యూటీ చైర్మన్ పదవి ఖాళీగా ఉన్నది. ఈనేపథ్యంలో డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు శుక్రవారం నోటిఫికేషన్ వెలువడింది. నేడు నామినేషన్లను స్వీకరించనున్నారు. 12న ఉదయం 10 గంటలకు శాసన మండలి ప్రారంభమైన అనంతరం డిప్యూటీ చైర్మన్ ఎన్నిక ప్రక్రియను పూర్తిచేసి బాధ్యతలు అప్పగించనున్నారు.
వరంగల్ జిల్లాకు చెందిన బండా ప్రకాశ్ 1981 నుంచి రాజకీయంగా యాక్టివ్ గా ఉన్నారు. వరంగల్ మున్సిపల్ కౌన్సిలర్ నుంచి రాజ్యసభ ఎంపీ దాకా పని చేసారు. తెలంగాణ ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. బండా ప్రకాష్ 2018 మార్చిలో బీఆర్‌ఎస్ తరఫున రాజ్యసభకు ఎన్నికయ్యారు. అయితే ఎంపీగా ఆరేండ్ల పదవీకాలం పూర్తికాకముందే.. 2021 నవంబర్ ఎమ్మెల్యే కోటాలో శాసన మండలికి ఎంపికయ్యారు.
అనంతరం అదేఏడాది డిసెంబర్ మొదటివారంలో తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజ్యసభ సభ్యుడిగా పలు కమిటీల్లో పని చేసారు. రాజ్యసభలో టిఆర్‌ఎస్ పక్ష ఉపనాయకుడిగా బండ ప్రకాష్ వ్యవహరించారు. రాజ్యసభ పదవీ కాలం పూర్తి కాకుండానే రాజీనామా చేయటంతో..ఇప్పుడు ప్రకాశ్ కు మండలి డిప్యూటీ ఛైర్మన్ గా అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది.

రాజ్యసభ సభ్యుడిగా రాజీనామా చేసిన తరువాత ప్రకాశ్ కు మంత్రి పదవి ఇస్తారనే ప్రచారం సాగింది. ఈటల రాజేందర్ పార్టీ వీడటంతో..అదే సామాజిక వర్గానికి చెందిన ప్రకాశ్ కు కేబినెట్ లో స్థానం దక్కుతుందని భావించారు. ఇప్పుడు మండలి ఛైర్మన్ గా అవకాశం దక్కింది. ఇక.. మండలిలో చీఫ్ విప్...రెండు విప్ పదవులను భర్తీ చేయాల్సి ఉంది.
ఇందుకోసం రేసులో సీనియర్లు ఉన్నారు. వరంగల్ జిల్లాకు చెందిన బండా ప్రకాశ్ ఇప్పుడు డిప్యూటీ ఛైర్మన్ గా నియామకం కావటంతో..ఆ జిల్లాకు చెందిన సీనియర్లకు ఎటువంటి అవకాశం దక్కుతుందనేది ఆసక్తి కరంగా మారుతోంది. శనివారం ఆయన ఒక్కరే నామినేషన్ దాఖలు చేస్తారని బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. డిప్యూటీ చైర్మన్ ఎన్నిక ఏకగ్రీవం కావటం ఖాయంగా కనిపిస్తోంది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications