KCR పని ఈజీ చేసిన బండి సంజయ్, రేవంత్‌రెడ్డి!!

తెలంగాణ రాష్ట్రంలో బలం పుంజుకుంటున్న ప్రత్యర్థి పార్టీలను ధీటుగా ఎదుర్కొనేందుకు ప్రయత్నిస్తున్న కేసీఆర్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, టీపీసీసీ రేవంత్ రెడ్డి మార్గం ఈజీ చేస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ మూడోసారి మళ్లీ అధికారంలోకి రావాలని వ్యూహాలు రచిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో బలపడుతున్న ప్రతిపక్ష పార్టీలను ధీటుగా ఎదుర్కోవాలని ప్రయత్నం చేస్తున్న కేసీఆర్ కు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, టి పి సి సి రేవంత్ రెడ్డి మార్గాన్ని సుగమం చేస్తున్నారు. వివిధ కార్యక్రమాలతో పాదయాత్రల పేరుతో ప్రజాక్షేత్రంలోకి వెళుతున్న వారు చేస్తున్న వ్యాఖ్యలతో బీఆర్ఎస్ పై జనాల వ్యతిరేకత అటుంచి, ఆయా ప్రతిపక్ష పార్టీలలోనే విచిత్రమైన పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి.

 బండి సంజయ్ వ్యాఖ్యలతో పార్టీలో ముసలం

బండి సంజయ్ వ్యాఖ్యలతో పార్టీలో ముసలం

ఇక తాజాగా బండి సంజయ్ ఎమ్మెల్సీ కవిత ఈడి విచారణ నేపథ్యంలో కవితను జైలుకు పంపించక ముద్దు పెట్టుకుంటారా అని చేసిన వ్యాఖ్యలు బిజెపిలో దుమారం రేపాయి. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ తప్పు పట్టారు. బండి సంజయ్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, కవిత పై చేసిన వ్యాఖ్యలను తాను ఖండిస్తున్నానని వ్యాఖ్యలు చేశారు. సామెతలను ఉపయోగించే సమయంలో జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్న ఆయన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు హోదా అంటే పవర్ సెంటర్ కాదు అంటూ అందరినీ సమన్వయం చేసే బాధ్యత అంటూ బండి సంజయ్ కు చురకలు అంటించారు. దీంతో బండి సంజయ్ ధర్మపురి అరవింద్ మధ్య చోటు చేసుకున్న అంతర్గత వివాదాలు బహిర్గతమయ్యాయి. కమలనాథుల్లోనూ గ్రూప్ రాజకీయాలు ఉన్నాయన్న వార్త ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చక్కర్లు కొడుతుంది. ఇది కేసీఆర్ కు, బీఆర్ఎస్ పార్టీకి కలిసి వచ్చే అంశంగా మారింది.

రేవంత్ రెడ్డి సొంత పార్టీ నేతలపై వ్యాఖ్యలు.. కాంగ్రెస్ లోనూ అసంతృప్తి

రేవంత్ రెడ్డి సొంత పార్టీ నేతలపై వ్యాఖ్యలు.. కాంగ్రెస్ లోనూ అసంతృప్తి


ఇక తాజాగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు కేసీఆర్ కు అమ్ముడుపోయారంటూ సొంత పార్టీ నేతల పైన సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం చేసిన సర్వేలో కాంగ్రెస్ పార్టీ రెండవ స్థానంలో ఉంది అని చెప్పి మరోసారి షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీలోకి చేరాలనుకున్న వారిని, సొంత పార్టీ నేతలు అడ్డుకున్నప్పటికీ పార్టీలో చేర్చుకోమని రాహుల్ గాంధీ చెప్పారంటూ రచ్చ చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ నాయకులలో రేవంత్ రెడ్డి పై తీవ్ర ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. ఇక తెలంగాణలో అధికారం మాదే అని చెప్పాల్సిన చోట రెండవ స్థానంలో ఉన్నామని రేవంత్ రెడ్డి చెప్పడం కాంగ్రెస్ శ్రేణులకు ఏమాత్రం రుచించడం లేదు.

 మాటలు తెచ్చిన తంటాలు ... అంతర్గత యుద్ధాలు ఎందాకా వెళ్తాయో?

మాటలు తెచ్చిన తంటాలు ... అంతర్గత యుద్ధాలు ఎందాకా వెళ్తాయో?


ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని, వారికి భరోసానిచ్చి వచ్చే ఎన్నికలలో బలంగా ప్రజల్లోకి వెళ్లాల్సిన బిజెపి, కాంగ్రెస్ పార్టీల రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతున్న మాటలతోనే ఇప్పుడు వారికి కష్టాలు వచ్చి పడ్డాయి. ఇప్పటికే సొంత పార్టీలో ఎదురీదుతున్న రేవంత్ రెడ్డి తాజాగా మరోమారు చేసిన వ్యాఖ్యలతో ముందు ముందు సొంత పార్టీ నేతల నుంచి మరింత ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుందని అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఇక మరోవైపు ధర్మపురి అరవింద్ తాజాగా చేసిన వ్యాఖ్యలతో బిజెపిలో అంతర్గత కలహాలు ఎక్కడ వరకు వెళతాయి అన్న చర్చ కూడా జరుగుతుంది.

కేసీఆర్ పనిని ఈజీ చేసేసిన బండి సంజయ్, రేవంత్ రెడ్డి

కేసీఆర్ పనిని ఈజీ చేసేసిన బండి సంజయ్, రేవంత్ రెడ్డి


ఇక ఇదే తెలంగాణ సీఎం కేసీఆర్ పనిని ఈజీ చేసే లాగా కనిపిస్తుంది. ప్రతిపక్షాలు ఐక్యంగా బలంగా ముందుకు వెళితే వచ్చే ఎన్నికల్లో కేసీఆర్, బిఆర్ఎస్ పార్టీ పెద్ద పోరాటమే చేయాల్సి వస్తుంది. అలాకాకుండా ప్రతిపక్షాలలో అంతర్గత కుంపట్లు ఉంటే కెసిఆర్ విజయానికి అవే కారణమవుతాయి. కాగల కార్యం గంధర్వులే తీర్చినట్టు కెసిఆర్ పనిని బండి సంజయ్, రేవంత్ రెడ్డి లు సులువు చేసేయడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+