హమ్మయ్యా.. బండి సంజయ్‌కు బెయిల్ మంజూరు
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌కు హైకోర్టులో ఊరట లభించింది. హైకోర్టు ధర్మాసనం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. బుధవారం బండి సంజయ్ తరపు న్యాయవాది దేశాయ్ ప్రకాశ్ రెడ్డి వాదనలను వినిపించారు. ఈ మేరకు బండి సంజయ్‌ను వెంటనే విడుదల చేయాలని హైకోర్టు ఆదేశాలి ఇచ్చిందని బీజేపీ లీగల్ సెల్ మీడియాకు తెలియజేసింది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కరీంనగర్ జైలులో రిమాండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. సెషన్స్ కోర్టు బెయిల్ నిరాకరించగా.. హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. అత్యవసర విచారణ చేపట్టాలని కోరడంతో న్యాయస్థానం అంగీకరించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు కాసేపటి క్రితం విచారణ జరిపి బెయిల్ ఇచ్చింది.

అంతకుముందు బండి సంజయ్ కుమార్‌పై పోలీసులు 10 కేసులు నమోదు చేశారు. ఆదివారం కోవిడ్ నిబంధనలకు సంబంధించి కేసు పెట్టిన సంగతి తెలిసిందే. దానితో సహా మరో పది కేసులను చూపించారు. డిజాస్టర్ మేనెజ్‌మెంట్ యాక్ట్ సహా 3 సెక్షన్ల కింద కేసులు ఉన్నాయి. బండి సంజయ్ కుమార్ రిమాండ్ రిపోర్టులో కేసుల వివరాలు ఉన్నాయి.
బండి సంజయ్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను కరీంనగర్ కోర్టు కొట్టి వేసింది. ఆయనకు 14 రోజుల జ్యూడిషీయల్ రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. బండి సంజయ్‌ను కోర్టు నుంచి కరీంనగర్ జైలుకు పోలీసులు తరలించారు. ఈ నెల 17వ తేదీ వరకుబండి సంజయ్‌తోపాటు కార్పొరేటర్ పెద్దపల్లి జితేందర్, పుప్పాల రఘు, కాచ రవి, మర్రి సతీశ్‌లకు కోర్టు జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. ఈ క్రమంలో హైకోర్టును ఆక్రయించగా.. ఊరట లభించింది. బండి సంజయ్‌ను తక్షణమే రిలీజ్ చేయాలని ఆదేశాలు జారీచేసింది.
-
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
చరిత్ర సృష్టించిన భారత ఆయిల్ ట్యాంకర్ 'జగ్ విక్రమ్'.. 20 వేల టన్నుల LPGతో హార్మూజ్ ను దాటి..











Click it and Unblock the Notifications