Telangana Assembly Elections 2023: గంగులపై సంచలన ఆరోపణలు చేసిన బండి సంజయ్..
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీనంగర్ ఎమ్మెల్యే అభ్యర్థి బండి సంజయ్ కరీంనగర్ రూరల్ మండలం చామనపల్లి గ్రామంలో ప్రచారం నిర్వహించారు. కార్నర్ మీటింగ్ లో పాల్గొన్న ఆయన మంత్రి గంగుల కమలాకర్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. గంగుల.. నీ లాగ గుట్టలు మాయం చేశానా?. భూకబ్జాలు చేశానా?.. పేదల ఇండ్లు కూల్చి సంపాదించానా? అంటూ గంగులపై ఫైర్ అయ్యారు.రాష్ట్రంలో అత్యంత అవినీతిపరుడు గంగుల కమలాకరే అని మండిపడ్డారు.
అవినీతిలో కరీంనగర్ టాప్ అని నిఘా నివేదికలే చెబుతున్నాయని చెప్పారు. అందుకే గంగులను కరీంనగర్ కే పరిమితం చేసి.. బీఫాం ఇవ్వకుండా సతాయించింది నిజం కాదా అని ప్రశ్నించారు. తాను రాష్ట్రంలో అధికారంలోనే లేనని.. నిరంతరం పోరాటాలే చేశానని తెలిపారు. అధికారంలో లేని తాను ఎట్లా అవినీతికి పాల్పడతా? అంటూ నిలదీశారు. సోయిండే మాట్లాడుతున్నవా? అంటూ బండి ఫైర్ అయ్యాడు.

తాను అవినీతిపరుడినైతే.. జాతీయ ప్రధాన కార్యదర్శిగా ప్రమోషన్ ఎట్లా ఇచ్చి గౌరవిస్తారు? అని అడిగారు. హెలికాప్టర్ ఇచ్చి రాష్ట్రమంతా ప్రచారం చేయిస్తున్న సంగతి తెల్వదా? అని ప్రశ్నించారు. అసలు కరీంనగర్ ప్రజలకు గంగుల ఒరగబెట్టిందేమిటి? అని నిలదీశారు. రేషన్ కార్డులు ఇచ్చే అధికారం ఉన్నా.. ఎందుకివ్వలేదు? అని ప్రశ్నించారు. వడ్ల కొనుగోలులో అక్రమాలను ఎందుకు ఆపలేదన్నారు.
బీసీ మంత్రి అయిన గంగుల.. ఎంతమంది బీసీలకు సాయం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. తనకు అధ్యక్ష పదవిస్తే.. నిరంతరం ప్రజల కోసం పోరాడినట్లు పేర్కొన్నారు. ఫాం హౌజ్ నుండి సీఎంను ధర్నా చౌక్ కు గుంజుకొచ్చానని.. జనం కోసం ఒక్కరోజైనా పోరాడి జైలుకు పోయినట్లు చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి ఎక్కడా లేదని, గాల్లో వచ్చిన వాళ్లు గాల్లోనే పోతారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి ఎవరు కావాలన్న అంశంపై గొడవ మొదలైందన్నారు. ఒకరికిస్తే ఇంకొకరు పార్టీని వదిలి వెళ్లే పరిస్థితి ఉందన్నారు. పొరపాటున బీఆర్ఎస్, కాంగ్రెస్‌లు అధికారంలోకి వస్తే మధ్యంతర ఎన్నికలు తథ్యమని బండి జోస్యం చెప్పారు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications